బిజినెస్

కామత్‌తో అరుణ్ జైట్లీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: మసాలా బాండ్ల జారీ, ఎన్‌డిబి (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు) భవిష్యత్ ప్రణాళికలు సహా వివిధ అంశాలపై ఆ బ్యాంకు ప్రెసిడెండ్ కెవి.కామత్‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్చలు జరిపారు. శనివారం ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. భారత్‌లో ఎన్‌డిబి కార్యకలాపాలను విస్తరించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించిన వీరు ఈ ఏడాది మన దేశంలో ఎన్‌డిబి అనుసరించే కార్యాచరణ ప్రణాళికలను గురించి కూడా చర్చించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు గవర్నర్లు, డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్న ఎన్‌డిబిని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. బ్రిక్స్ సభ్య దేశాల్లో వౌలిక వసతులతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలను సమకూర్చాలన్న ప్రధాన లక్ష్యంతో ఎన్‌డిబి ఏర్పాటైంది.
నేడు ఎస్‌ఎఎస్‌ఇసి సమావేశం
ఇదిలావుంటే, అరుణ్ జైట్లీ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో ఎస్‌ఎఎస్‌ఇసి (దక్షిణాసియా ఉప ప్రాంతీయ ఆర్థిక సహకార సంఘం) సమావేశం జరుగనుంది. భారత్‌తో పాటు ఎస్‌ఎఎస్‌ఇసిలో సభ్య దేశాలుగా ఉన్న బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక ఆర్థిక మంత్రులు, అధికారులు, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.