బిజినెస్

ఆర్‌బిఐ పాలసీయే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరపనున్న ద్రవ్య పరపతి విధానం సమీక్ష, అలాగే స్థూల ఆర్థిక గణాంకాల విడుదల వచ్చేవారం స్టాక్స్ ఏ దిశలో కదలనున్నాయో నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో వచ్చే వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరగనుంది. ‘సర్వీస్ రంగానికి, అలాగే ఉత్పాదక రంగానికి సంబంధించిన పిఎంలతో పాటుగా వచ్చేవారం స్థూల ఆర్థిక గణాంకాలు విడుదల కానున్నాయి. మార్కెట్లు ఏ దిశలో కదలనున్నాయో ఈ గణాంకాలు నిర్ణయించనున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం వచ్చే వారం జరగనున్న ఆర్‌బిఐ ద్రవ్య సమీక్ష. మొత్తంమీద ఈ వారం మార్కెట్లు ఆటుపోట్ల మధ్యనే కొనసాగవచ్చని మేము భావిస్తున్నాం’ అని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్, ఇనె్వస్ట్‌మెంట్స్ డైరెక్టర్, రిసెర్చ్ విభాగం చీఫ్ అబ్నిశ్ కుమార్ సుధాంశు అన్నారు. అలాగే ఉత్పాదక రంగం, సేవా రంగాలకు సంమంధించిన పిఎంఐ గణాంకాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ఆర్థిక గణాంకాలు విడుదల కానున్నాయి. అయితే ఇవన్నీ మన మార్కెట్లపై ప్రభావం చూపించకపోవచ్చు. అయితే బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఆర్‌బిఐ ద్రవ్య సమీక్షకు ముందు దానికి అనుగుణంగా మార్కెట్లు స్పందించే అవకాశం ఉంది’ అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ పిసిజి విభాగం హెడ్ వికె శర్మ చెప్పారు. డాలరుతో రూపాయి కదలిక, ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం ఫలితం వచ్చే వారం మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించనున్నాయి అని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మార్చి నెల అమ్మకాల గణాంకాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఆటో స్టాక్స్‌పై మదుపరుల దృష్టి ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతవారంలో బిఎస్‌ఇ సెనె్సక్స్ 199 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ దాదాపు 66 పాయింట్లు లాభపడ్డం తెలిసిందే.