బిజినెస్

ఐపిఎల్-10కు స్పాన్సర్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: క్రికెట్ పండగ మొదలైంది. పొట్టి మ్యాచ్‌లకు యమా క్రేజ్‌ను తీసుకొచ్చిన ఐపిఎల్‌లో పదో సీజన్ రానేవచ్చింది. వివిధ వ్యాపార సంస్థలు ఇప్పటికే ఆయా జట్లతో తమ స్పాన్సర్‌షిప్‌లను దాదాపు ఖరారు చేశాయి. తాజాగా మొబైల్ ఫోన్ల తయారీదారు జియోని ఇండియా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మరోవైపు సైకిళ్ల ఉత్పత్తిదారు హీరో సైకిల్స్.. కింగ్స్ లెవన్ పంజాబ్ ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా జియోని వ్యవహరిస్తోంది. కాగా, నాకౌట్ దశ వరకు జరిగే 56 మ్యాచ్‌ల్లో 26 మ్యాచ్‌లలో జియోని బ్రాండ్ ఐపిఎల్ ప్రేక్షకులకు కనిపిస్తుందని మంగళవారం జియోని ఇండియా సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ ఆర్ వోహ్రా తెలిపారు. నిరుడు మార్కెటింగ్ కోసం సుమారు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇక కింగ్స్ లెవన్ పంజాబ్‌తో భాగస్వామ్యం వల్ల యువతకు మరింత చేరువ కాగలమన్న విశ్వాసాన్ని హీరో సైకిల్స్ వెలిబుచ్చింది. ‘ఈ భాగస్వామ్యంతో లక్షలాది క్రికెట్ ప్రేమికులను, ముఖ్యంగా యువతకు దగ్గరవుతాం.’ అని హీరో సైకిల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజల్ అన్నారు. భారత్‌లో అంత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా కార్యక్రమం ఐపిఎల్ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్న ఆయన దేశంలోనేగాక, విదేశాల్లోనూ దీనికి ప్రేక్షకులు ఎక్కువని, కాబట్టి దీనిపై సహజంగానే వ్యాపార సంస్థలకు ఆసక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే లక్స్ ఇండస్ట్రీస్ సైతం తమ ప్రతిష్ఠాత్మక బ్రాండ్ లక్స్ కోజీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు లక్స్ కోజీ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇది వరుసగా రెండో ఏడాది. అలాగే ఉషా ఇంటర్నేషనల్.. ముంబయి ఇండియన్స్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇది వరుసగా నాలుగో ఏడాది. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కూడా అల్ట్రాటెక్, రిలయన్స్ జియో, కెనరా బ్యాంక్, రెడ్ ఎఫ్‌ఎమ్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ఐపిఎల్-10 సీజన్.. వచ్చే నెల 21న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.