బిజినెస్

ఒకేరోజు 900 విమానాలను నడిపిన ఇండిగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ ఇండిగో.. శుక్రవారం ఒక్కరోజే 900 విమానాలను నడిపింది. ఒక భారతీయ ఎయిర్‌లైన్ సంస్థ ఈ స్థాయిలో విమానాలను కేవలం ఒక్కరోజే నిర్వహించడం ఇదే తొలిసారి. ‘తొలిసారిగా నిన్న ఒక్కరోజే 900 డైలీ విమాన సర్వీసులను నడపడం ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు మా లక్ష్యంగా 1,000 విమానాలే.’ అని ఇండిగో అధ్యక్షుడు ఆదిత్యా ఘోష్ శనివారం ఓ ప్రకటనలో చెప్పారు. ఇండిగో వద్ద 131 ఎయిర్‌బస్ విమానాలున్నాయి. ఇవి 44 చోట్లకు ప్రయాణిస్తాయి.