బిజినెస్

తగ్గిన థర్డ్ పార్టీ బీమా ప్రీమియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా లారీ యజమానులు తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. పెంచిన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంలో 27 శాతం తగ్గించేందుకు బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎ చైర్మన్ అంగీకరించటంతో లారీ యజమానుల సంఘం సమ్మెను విరమించుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీల ఆదేశాల మేరకు ఐఆర్‌డిఎ చైర్మన్ విజయన్ శుక్ర, శనివారాల్లో లారీ యజమానుల సంఘ ప్రతినిధులతో హైదరాబాద్‌లో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వాస్తవానికి ఈ అంశంతోపాటు మరికొన్ని డిమాండ్లపై తొలుత దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానులు పదిరోజుల క్రితం నిరవధిక సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వరకు తమ పరిధిలోనున్న లీటరు డీజిల్‌పై 4 రూపాయల వ్యాట్ తొలగింపు, ఇతర సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హామీనివ్వటంతో గురువారం రాత్రి నుంచి రాష్ట్రంలో లారీల సమ్మె విరమించుకున్నారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో సమ్మె కొనసాగుతుండటం, దీనికితోడు దేశవ్యాప్తంగా శనివారం నుంచి నిరవధిక సమ్మెకు ఆలిండియా ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన క్రమంలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తగ్గింపునకు ఐఆర్‌డిఎ హామీనివ్వడంతో దేశవ్యాప్తంగా లారీల సమ్మెను విరమించుకున్నారు. ఈ చర్చల్లో లారీ యజమానుల సంఘ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు, ఏపి లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు జి గోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి జి షణ్ముగమ్, రవాణా శాఖ రాష్ట్ర కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ థర్డ్ పార్టీ బీమా ప్రీమియం సమస్య దేశం మొత్తానికి సంబంధించినదైనప్పటికీ ఐఆర్‌డిఎ చర్చల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ తరపునే రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొనటం అభినందించదగినదన్నారు. తమ సమస్య పరిష్కారంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగానో సహకరించారంటూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దిగివచ్చిన ప్రీమియం రేట్లు
7.5 నుంచి 12 టన్నులతో కూడిన మినీ వ్యాన్లకు 2016-17లో 15,365 రూపాయల ప్రీమియం ఉండగా, 2017-18లో ఒక్కసారిగా 23,047 రూపాయలకు పెరిగింది. తాజాగా జరిగిన చర్చల్లో 3,554 రూపాయలు తగ్గటంతో 19,513 రూపాయలకు చేరింది. 12 నుంచి 20 టన్నులతో కూడిన ఆరు టైర్ల లారీకి 22,577 రూపాయల నుంచి 33,865 రూపాయలకు చేరగా, ప్రస్తుతం 28,672 రూపాయలకు తగ్గింది. 20 నుంచి 40 టన్నులతో కూడిన 10, 12, 14 టైర్ల లారీకి 24,708 రూపాయల నుంచి 37,062 రూపాయలకు పెరగ్గా, 31,379 రూపాయలకు తగ్గింది. 40 టన్నులపైన ట్రాలర్స్‌కు ప్రీమియం ధర 25,800 రూపాయల నుంచి 38,700 రూపాయలకు చేరగా, అది 32,766 రూపాయలకు తగ్గింది. అయితే అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంది.