బిజినెస్

వెలవెలబోయిన వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఒక్కరోజే వెండి ధర భారీగా పతనమైంది. శనివారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా 800 రూపాయలు పడిపోయింది. దీంతో 42 వేల మార్కుకు దిగువన 41,750 రూపాయల వద్దకు చేరింది. అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య వెండి కొనుగోళ్లపట్ల పరిశ్రమల ఆసక్తి సన్నగిల్లింది. నాణేల తయారీదారులు కూడా వెండి నిల్వలను తగ్గించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ధరలు పెద్ద ఎత్తున క్షీణించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు వెండి ధర 1.54 శాతం పతనమై 17.96 డాలర్లకు చేరింది. మరోవైపు శుక్రవారం ముగింపుతో చూస్తే బంగారం ధర యథాతథంగా ఉంది. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 29,300 రూపాయల వద్ద ఉంది. అంతర్జాతీయంగా మాత్రం 0.18 శాతం పెరిగి 1,253.80 డాలర్లు పలికింది.