బిజినెస్

పడిపోయిన బంగారం దిగుమతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-్ఫబ్రవరి వ్యవధిలో దేశీయ బంగారం దిగుమతులు దాదాపు 24 శాతం పడిపోయాయి. 23.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 30.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో చోటుచేసుకున్న అస్థిరతే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. కాగా, విదేశాల నుంచి భారతీయ దిగుమతుల్లో చమురు తర్వాతి స్థానం పసిడిదే. అలాంటి పుత్తడి దిగుమతులు పడిపోవడంతో వాణిజ్య లోటు 95.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2015-16లో ఇది 114.3 బిలియన్ డాలర్లుగా ఉంది.