బిజినెస్

ఆట కాదిది... కాసుల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: క్రీడా-వ్యాపార రంగాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. అయతే ఐపిఎల్‌తో ఇది విడదీయరాని బంధంగా ఏర్పడింది. పరిమిత ఓవర్లలో.. అదికూడా కేవలం 20 ఓవర్లు కలిగిన పొట్టి మ్యాచ్‌లకు యమా క్రేజ్‌ను తీసుకొచ్చిన ఐపిఎల్‌లో పదో సీజన్ మొదలైనది తెలిసిందే. బంతిని బలంగా బాదుతూ బౌండరీలకు చేర్చడమే లక్ష్యంగా ఆడే ఈ ఆటపట్ల వ్యాపార వర్గాలకూ మక్కవ ఎక్కువే. వివిధ వ్యాపార సంస్థలు ఆయా జట్లకు భారీ స్థాయలో స్పాన్సర్‌షిప్‌లను అందిస్తున్నాయ కూడా. ఐపిఎల్‌లో కనిపిం చాలని కార్పోరేట్లు తహతహలాడుతున్నారు మరి. ఇందుకు తగ్గట్లే ఆటగాళ్ల జెర్సీల నిండా కంపెనీల పేర్లే దర్శనమివ్వడం చుడొచ్చు. మొబైల్ ఫోన్ల తయారీదారు జియోని ఇండియా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో భాగస్వామ్యాన్ని ప్రకటించగా, మరోవైపు సైకిళ్ల ఉత్పత్తిదారు హీరో సైకిల్స్.. కింగ్స్ లెవన్ పంజాబ్ ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది. పార్సిల్ సర్వీస్ ప్రొవైడర్ డిటిడిసి ఎక్స్‌ప్రెస్ సైతం కింగ్స్ లెవన్ పంజాబ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గుజరాత్ లయన్స్ జట్టుతో క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా జియోని వ్యవహరిస్తుండ గా, నాకౌట్ దశ వరకు జరిగే 56 మ్యాచ్‌ల్లో 26 మ్యాచ్‌లలో జియోని బ్రాండ్ ఐపిఎల్ ప్రేక్షకులకు కనిపిస్తుందని జియోని ఇండియా సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ ఆర్ వోహ్రా తెలిపారు. నిరుడు మార్కెటింగ్ కోసం సుమారు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇక కింగ్స్ లెవన్ పంజాబ్‌తో భాగస్వామ్యం వల్ల యువతకు మరింత చేరువ కాగలమన్న విశ్వాసాన్ని హీరో సైకిల్స్ వెలిబుచ్చింది. ‘ఈ భాగస్వామ్యంతో లక్షలాది క్రికెట్ ప్రేమికులను, ముఖ్యంగా యువతకు దగ్గరవుతాం.’ అని హీరో సైకిల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజల్ అన్నారు. భారత్‌లో అంత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా కార్యక్రమం ఐపిఎల్ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్న ఆయన దేశంలోనేగాక, విదేశాల్లోనూ దీనికి ప్రేక్షకులు ఎక్కువని, కాబట్టి దీనిపై సహజంగానే వ్యాపార సంస్థలకు ఆసక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే లక్స్ ఇండస్ట్రీస్ సైతం తమ ప్రతిష్ఠాత్మక బ్రాండ్ లక్స్ కోజీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు లక్స్ కోజీ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇది వరుసగా రెండో ఏడాది. అలాగే ఉషా ఇంటర్నేషనల్.. ముంబయి ఇండియన్స్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇది వరుసగా నాలుగో ఏడాది. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కూడా అల్ట్రాటెక్, రిలయన్స్ జియో, కెనరా బ్యాంక్, రెడ్ ఎఫ్‌ఎమ్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. బోలెడంత డబ్బుతో స్పాన్సర్‌షిప్‌ల నిస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు.. అన్ని జట్లకు యాజమాన్యాలుగా కూడా ఉన్నాయ. ముంబయ ఇండియన్స్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నితా అంబానీ యజమానిగా ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమా నులుగా కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా, ప్రముఖ నటుడైన షారూఖ్ ఖాన్‌తోపాటు ఒకప్పటి బాలీవుడ్ అందాల తార జూహీ చావ్లా భర్త, బ్రిటన్‌కు చెందిన పారిశ్రామికవేత్త అయన జై మెహతా వ్యవహరిస్తున్నారు. కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు యాజమాన్యంగా బాలీవుడ్ నటి ప్రీతి జింటాతోపాటు అపీజై సురేంద్ర గ్రూప్ చైర్మన్ కరణ్ పాల్, డాబర్‌కు చెందిన మోహిత్ బర్మన్ ఉన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అధిపతిగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఉండగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు గ్రంథి మల్లిఖార్జున రావు ఆధ్వర్యంలోని జిఎమ్‌ఆర్ గ్రూప్‌ది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్ నెట్‌వర్క్ యజమాని కళానిధి మారన్‌ది అవగా, గుజరాత్ లయన్స్ ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు చెందిన కేశవ్ బన్సల్‌ది. రైజింగ్ పుణె సూపర్‌గెయంట్స్ జట్టు ఆర్‌పి సంజీవ్ గోయెంకా గ్రూప్‌ది. ఇవేగాక గతంలో కనిపించిన రాజస్థాన్ రాయల్స్‌కు శిల్పాశెట్టితో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు అండగా నిలిచారు. ఐపిఎల్ ద్వితీయ విజేత అయన డెక్కన్ చార్జర్స్ యజమానిగా ప్రముఖ ఆంగ్ల, తెలుగు దినపత్రికలైన డెక్కన్ క్రానికల్, ఫైనాన్షియల్ క్రానికల్, ఆంధ్రభూమి అధినేత టి వెంకట్రామిరెడ్డి ఉన్నది తెలిసిందే. అలాగే పుణె వారియర్స్ సారథిగా సహారా గ్రూప్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేతగా ఇండియా సిమెంట్స్, కొచ్చి టస్కర్స్ యజమానిగా రెండెజ్‌వస్ స్పోర్ట్స్ వరల్డ్ సంస్థలు వ్యవహరించాయ. ఇలా ఐపిఎల్‌తో క్రీడాభిమా నులకు పెద్ద పండగనే చూపిస్తూ.. మరోవైపు తమ వ్యాపారాభివృద్ధికి వేదికగానూ మార్చుకుంటున్నాయ వ్యాపార సంస్థలు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయ కూడా. ఇక ఆటగాళ్ల విషయాని కొస్తే.. ఫ్రాంచైజీల నుంచి కోట్ల రూపాయలను పొందుతున్నారు. ప్రస్తుత ఐపిఎల్-10 సీజన్‌కు సంబంధించి జరిగిన వేలంలో రైజింగ్ పుణె సూపర్‌గెయంట్స్ అత్యధికంగా 14.5 కోట్ల రూపాయలతో విదేశీ ఆటగాడు బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. ఇలా దేశ, విదేశీ ఆటగాళ్లకు యేటా ఐపిఎల్ కాసుల వర్షం కురిపిస్తుండగా, వారి ప్రతి పరుగుకి, వికెట్‌కూ వద్దన్నా డబ్బే లభిస్తోంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు, సిరీస్‌ల పేరిట ఎలాగూ మరికొంత సొమ్ము చేతికందుతూనే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ (జిడిపి)కు 2015 ఐపిఎల్ సీజన్ 1,150 కోట్ల రూపాయలను అందించిందని బిసిసిఐ చెబుతోంది. ఇక 2007లో మొదలైన ఈ ఐపిఎల్ బ్రాండ్ విలువను 30 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసింది అమెరికన్ అప్రైజల్. మరోవైపు ఐపిఎల్‌కు అధికారిక బ్రాడ్‌కాస్ట్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సోనీ నెట్‌వర్క్.. ప్రస్తుత 10వ సీజన్ నుంచి ప్రకటనల ద్వారా 1,200 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేస్తోంది. నిరుడు 1,000 కోట్ల రూపాయల రెవిన్యూను పొందింది. కాగా, ఈసారి అమెజాన్‌తోపాటు వివో, వొడాఫోన్ సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయ. సియట్, పాలీకేబుల్, యమహా మోటార్‌సైకిల్స్, విమల్ పాన్ మసాలా, మేక్‌మిట్రిప్, పార్లే అగ్రోకు చెందిన ఫ్రూటీ, వోల్టాస్, యెస్ బ్యాంక్‌లు అసోసియేట్ స్పాన్సర్లుగా ఉన్నాయ. యేటేటా ఐపిఎల్ ప్రకటనల ధరలను పెంచుతున్న సోనీ.. 8వ సీజన్‌లో 20-25 శాతం ప్రేక్షకులను, 9వ సీజన్‌లో 10-15 శాతం ప్రేక్షకులను పెంచుకుంది. బుధవారం నుంచి ప్రారంభమైన ఐపిఎల్-10 సీజన్.. వచ్చే నెల 21న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.