బిజినెస్

అమ్మకానికి రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో మొత్తం 80 శాతం వాటాను అమ్మేస్తోంది రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ట్రూ నార్త్ మేనేజర్స్ నేతృత్వంలోని ఓ మదుపరుల కూటమి దాదాపు 1,040 కోట్ల రూపాయలకు ఈ మొత్తం వాటాను కొనుగోలు చేస్తోంది. కాగా, దీనికి సంబంధించి మదుపరుల కూటమితో ఒప్పందాలను చేసుకున్నట్లు రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఆదివారం తెలిపింది. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, కార్పొరేషన్ బ్యాంక్‌కు ఐదు శాతం చొప్పున వాటాలున్నాయి.