బిజినెస్

పెరిగిన టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. విదేశీ అమ్మకాలు గత నెల మార్చిలో నిరుడు మార్చితో పోల్చితే 9 శాతం మేర పెరిగాయి. ఈసారి 1,29,951 యూనిట్ల విక్రయాలు జరిగితే, పోయినసారి 1,18,750 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ స్పష్టం చేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో ఈసారి అమ్మకాలు 87,355 యూనిట్లుగా ఉంటే, నిరుడు 73,515 యూనిట్లుగా ఉన్నాయి. లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు 11 శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ ఈ సందర్భంగా తెలియజేసింది.