బిజినెస్

జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయంగా ప్యాసింజర్ వాహన అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 9.23 శాతం పెరిగినట్లు ఆటో పరిశ్రమల సంఘం సియామ్ తెలిపింది. 30,46,727 యూనిట్ల విక్రయాలు జరిగాయంది. 2015-16లో 27,89,208 యూనిట్ల అమ్మకాలే జరిగినట్లు చెప్పింది. గత నెల మార్చిలో 8.17 శాతం వృద్ధితో 2,82,519 యూనిట్ల అమ్మకాలు జరిగాయంది. అంతకుముందు మార్చిలో 2,56,920 యూనిట్ల విక్రయాలు జరిగాయని చెప్పింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 7 నుంచి 9 శాతం పెరగగలవన్న అంచనాను వ్యక్తం చేసింది. ఇక 2016-17లో ప్యాసింజర్ వాహన ఎగుమతులు రికార్డు స్థాయిలో 16 శాతం పెరిగాయంది. ఇదిలావుంటే కాలుష్య నిరోధం పేరిట బిఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం.. ఆటో రంగంలో పెట్టుబడులను విఘాతం పరిచేలా ఉందని సియామ్ వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయం వల్ల ఇంకా ఆటోరంగ సంస్థల వద్దే రూ. 5 వేల కోట్ల విలువైన వాహనాలు ఉండిపోయాయంది. ఇవన్నీ అమ్ముకోలేని పరిస్థితి అని చెప్పింది.