బిజినెస్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ. 400 కోట్లతో బిఎస్‌ఎన్‌ఎల్ ఆధునీకరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలంగాణ టెలికామ్ సర్కిల్ చీఫ్ జిఎం ఎల్ అనంతరామ్ మంగళవారం తెలిపారు. ఉమ్మడి ఏపి సర్కిల్‌లో గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో మొత్తం 2,526.18 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు. మొత్తం 155 వైఫై హాట్‌స్పాట్‌లను ప్రారంభించామన్నారు. ఆసుపత్రులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో వైఫై సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. తమ సంస్థ మొబైల్ విభాగంలో ఉమ్మడి ఏపి సర్కిల్‌లో 1,475.86 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అదనంగా 1,170 టవర్లను నిర్మించనున్నట్లు చెప్పారు.
నిరుడు ఉమ్మడి ఆంధ్రలో మొత్తం 17,021 కొత్త ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఇచ్చామని, బ్రాడ్‌బాండ్ పరంగా 1,31,154 కనెక్షన్లు ఇచ్చామని, ఫైబర్ టు ది హోమ్ విభాగంలో 9,407 కనెక్షన్లు ఇచ్చామన్నారు. కాగా, తెలంగాణలో 121 హాట్ స్పాట్ జోన్ల వెంట 925 యాక్సెస్ పాయింట్లను నెలకొల్పాలని ప్రతిపాదించామన్నారు. జిల్లా కేంద్రాల్లో, ఇతర ముఖ్యమైన పట్టణాల్లో 3జి డేటా స్పీడ్‌లను ఇప్పుడున్న 14.4 ఎంబిపిఎస్ నుండి 21.6 ఎంబిపిఎస్‌కు పెంచామన్నారు. ఈ ఏడాది ఎంపిక చేసిన పట్టణాల్లో 4జి సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రోకారిడార్ వెంట బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు నిరంతరాయంగా 3జి సేవలను అందించేందుకు 2జి, 3జి సైట్‌లు 64 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.