బిజినెస్

పది రూపాయల నాణేలు చెల్లుతాయ: ఆర్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు కొన్ని చోట్ల పది రూపాయల నాణేల చట్టబద్ధత గురించి, వర్తకులు, దుకాణదారులు, సామాన్య ప్రజానీకంలో సందేహాలు లేవనెత్తుతున్నందున రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని మరోసారి ప్రకటించింది.
ఇటువంటి పుకార్లను నమ్మకుండా, ఈ నాణేలను చట్టబద్ధమైనవిగా తమ లావాదేవీలలో స్వీకరించవచ్చని రిజర్వు బ్యాంక్ తెలిపింది. లేనిపక్షంలో నేరమవుతుందని చెప్పింది. భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన నాణేలను రిజర్వు బ్యాంకు చెలామణిలోకి తెస్తుంది.