బిజినెస్

రూ. లక్ష కోట్లు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో లక్ష కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రంలోనే నరేంద్ర మోదీ సర్కారు డిజిటల్ లావాదేవీలకు పెద్దపీట వేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ అజెండాను మరింత ముందుకు తీసుకెళ్తూ లక్ష కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకుంది ఎస్‌బిఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం పరిచయం చేసిన డిజి ధన్ మేళా ప్రచారాన్ని వివిధ కార్యక్రమాలకు అనుసంధానిస్తున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది. నాబార్డు పథకం క్రింద 12,500 గ్రామాల్లో 25,000 కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా డిజిటల్ ఎకో వ్యవస్థ అభివృద్ధికి 110 గ్రామాలను దత్తత తీసుకుంటున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో ఎస్‌బిఐ స్పష్టం చేసింది. డిజిటల్ సాధికారత సమాజంగా భారత్ రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఎస్‌బిఐ కీలకపాత్ర పోషిస్తుందని బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 5.2 లక్షల యాక్సెప్టెన్స్ టచ్ పాయింట్లకు చేరువ కావాలన్నదే ఎస్‌బిఐ లక్ష్యమని అన్నారు. వీటిలో 4 లక్షల డిజిటల్ పిఒఎస్ (్భరత్ క్యుఆర్, ఆధార్ పే)లు ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం లావాదేవీల విలువ లక్ష కోట్ల రూపాయలుగా ఉంటుందన్నారు. యుపిఐ, ఆధార్ పే రెండూ కూడా కస్టమర్లకు ధన ప్రయోజనం కలిగించేవేనని ఎస్‌బిఐ ఎండి రజ్నీశ్ కుమార్ చెప్పారు. కాగా, ఆన్‌లైన్‌లో ఎస్‌బిఐ వెబ్ బ్యాంకింగ్ వేదిక.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు సందర్శిస్తున్న ఆర్థిక వెబ్‌సైట్లలో ఐదోదిగా ఉంది.
23రెట్లు పెరిగాయ్
గత నెలలో డిజిటల్ లావాదేవీలు దాదాపు 23రెట్లు పెరిగాయి. మార్చి నెలలో 2,425 కోట్ల రూపాయలు విలువచేసే సుమారు 64 లక్షల లావాదేవీలు జరిగాయని నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. నిరుడు మార్చి నెలలో 101 కోట్ల రూపాయల విలువైన 2,80,000 డిజిటల్ లావాదేవీలు జరిగితే, ఈ ఏడాది మార్చిలో 2,425 కోట్ల రూపాయల విలువైన 63,80,000 డిజిటల్ లావాదేవీలు జరిగాయని వివరించింది. ఇక నిరుడు నవంబర్‌లో 2.5 కోట్లుగా ఉన్న ఆధార్ ఆధారిత పేమెంట్లు.. మార్చిలో 5 కోట్లకుపైగా చేరాయని చెప్పింది. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనలో భాగంగా నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినది తెలిసిందే. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు కూడా. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను పొందవచ్చని మోదీ తెలిపారు. ఇందుకు డిసెంబర్ ఆఖరుదాకా గడువు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మార్చి చివర్లోగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చని సూచించారు. అయితే కొత్త 500 రూపాయల నోట్ల విడుదలలో జాప్యం, కేవలం 2,000 రూపాయల నోట్ల లభ్యత వల్ల చిల్లర కష్టాలు ఏర్పడ్డాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ద్రవ్య వ్యవస్థలో చివరకు 2,000 రూపాయల నోట్లు.. ఆ తర్వాత 100, 50, 20, 10 రూపాయల వంటి చిన్న నోట్లే ఉండటం, ఆ చిన్న నోట్లు కూడా చాలా తక్కువగా ఉండటంతో చిల్లర కష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా అమ్మకాలు దారుణంగా పడిపోగా, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఎటిఎమ్‌లలోనూ నగదు లేకుండగా, బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ నరేంద్ర మోదీ సర్కారు డిజిటల్ లావాదేవీల నినాదాన్ని ఎత్తుకుంది. నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన పేరిట నిరుడు డిసెంబర్ 25న రెండు పథకాలను ప్రవేశపెట్టింది. కొనే వినియోగదారుడు, అమ్మే దుకాణదారుడికి లబ్ధి చేకూరేలా వీటిని పరిచయం చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులపై కొన్నవారికి, విక్రయాలు జరిపినవారికి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు నగదు బహుమతులను ప్రకటించింది. డ్రాల ద్వారా ఈ బహుమతులను కేంద్రం అందిస్తోంది కూడా. ఇదిలావుంటే నిరుడు నవంబర్ నుంచి గత నెల మార్చి వరకు తక్షణ చెల్లింపు సేవా (ఐఎమ్‌పిఎస్) లావాదేవీలు కూడా 3.6 కోట్ల నుంచి 6.7 కోట్లకు పెరిగినట్లు నీతి ఆయోగ్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఇకపోతే వ్యాపారుల కోసం భీమ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత పేమెంట్లను కేంద్రం శుక్రవారం ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రకటించింది. ఈ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాగ్‌పూర్‌లో ఆరంభించారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 75 నగదు రహిత టౌన్‌షిప్‌లను ప్రారంభించారు.