బిజినెస్

త్రైమాసిక ఫలితాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమాసిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా క్షిపణి, బాంబు దాడుల నేపథ్యంలో నెలకొన్న భౌగోళిక ఆందోళనల ప్రభావం కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో వీటిపై ఆధారపడే.. మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. గతవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 245.16 పాయింట్ల్లు క్షీణించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 47.50 పాయింట్లు కోల్పోయంది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తుండటంతో మదుపరుల దృష్టి ప్రధానంగా వీటిపై ఉండొచ్చనే అభిప్రాయాలు మార్కెట్ విశే్లషకుల నుంచి వస్తున్నాయ. అయతే అమెరికా క్షిపణి, బాంబు దాడుల మధ్య మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, కమ్ముకుంటున్న యుద్ధమేఘాలపైనా మదుపరులు అప్రమత్తంగానే ఉంటున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు సోమవారం విడుదలయ్యే టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) గణాంకాలు కూడా మార్కెట్ తీరును శాసించవచ్చని చెబుతున్నారు. ఆమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ రిసెర్చ్ అధిపతి, డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు మాట్లాడుతూ ‘త్రైమాసిక ఫలితాలు కీలకం. మరో ముఖ్యమైన అంశమేమంటే గత నెల మార్చికిగాను టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం విడుదలవు తున్నాయ. గత వారం విడుదలైన వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) గణాంకాలు పెరగడం, పారిశ్రామికోత్పత్తి సూచీ పడిపోయన నేపథ్యంలో టోకు ధరల సూచీ కూడా క్షీణిస్తే స్టాక్ మార్కెట్లు పతనం కావచ్చు. అలాగే భౌగోళిక రాజకీయ ఆందోళనలనూ మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారు.’ అన్నారు. ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయతే దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని బిజెపి సొంతం చేసుకున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు సంస్కరణల బాట పడుతుందని మదుపరులు గట్టిగా విశ్వసిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన మెజారిటీని సాధించినది తెలిసిందే. మణిపూర్, గోవా రాష్ట్రాల్లోనూ మద్దతుదారు లతో కలిసి అధికారాన్ని దక్కించుకుంది. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయతే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో లోక్‌సభలో ఇప్పటికే బలం కలిగిన బిజెపికి రాజ్యసభలోనూ బలం పెరగనుంది. దీంతో ఆర్థిక సంస్కరణల విషయంలో ఇప్పుడే దూకుడు ప్రదర్శిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరింతగా సంస్కరణలను ప్రవేశపెడతారన్న నమ్మకం మదుపరులలో కనిపిస్తోందని, అదే జరిగితే పెట్టుబడులు పోటెత్తడం ఖాయమన్న అభిప్రాయాలూ మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయ. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందని, వచ్చే ఏడాది జరిగే రాష్టప్రతి ఎన్నికలోనూ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిది పైచేయగా నిలుస్తుందని సింఘానియా చెప్పారు. కాగా, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.