బిజినెస్

చమురు శుద్ధిలో నవశకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా దేశంలో రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ స్పష్టం చేశారు. విశాఖ నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న 21వ రిఫైనరీ టెక్నాలజీ మీట్ (ఆర్‌టిఎం)ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం దేశ అవసరాలకు 230 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధనం శుద్ధి చేసేందుకు అవసరమైన రిఫైనరీలు సామర్థ్యం ఉందని, దీన్ని 2040 నాటికి 600 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచనున్నట్టు తెలిపారు. ప్రస్తుత సామర్థ్యానికి ఇది మూడు రెట్లు అధికమన్నారు. ఇంధన వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా ఉందన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కూడా రిఫైనరీలను ఏర్పాటు చేసుకుంటున్నామని, అధిక సామర్థ్యంతో ఎక్కువ ఇంధన శుద్ధి సాధించే విధంగా రిఫైనరీలు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. పర్యావరణ హితంగా ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగానే కర్బన రహిత ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పర్యావరణ హితంగా బి 4 వాహనాలకు అనుగుణంగా ఇంధన ఉత్పత్తిని చేపట్టామని, భవిష్యత్‌లో బి 6 వాహనాలకు అనుగుణంగా ఇంధన ఉత్పత్తి సాధించాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. దీనికోసం 2020 నాటికి బి 6 వాహనాలకు అనుగుణంగా ఇంధనం ఉత్పత్తి చేసేందుకు రిఫైనరీల ఆధునికీకరణ తదితర అంశాలకు 14 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఇంధన అవసరాలు, ఇంధన వ్యాపారంలో సరికొత్త పోకడలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. చమురు శుద్ధి కర్మాగారాల సాంకేతికత, ఆధునికరణలో భారత్ కూడా ముందంజలో ఉందన్నారు. భారత్ చమురుశుద్ధి రంగంలో నవశకం మొదలైందని మంత్రి ధర్మేంద్రప్రదాన్ అన్నారు. భారత్ అవరాలతో పాటు పొరుగు దేశాల ఇంధన అవసరాలను తీర్చే స్థాయికి ఎదిగిందన్నారు. భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఇంధన శుద్ధి రంగంలో మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలతో సంయుక్త ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు.
సామాన్యుని నిత్యావసరంగా పెట్రో ఉత్పత్తుల వినియోగం పెరిగిపోయిందని మంత్రి ధర్మేంద్రప్రదాన్ అన్నారు. ప్రజల అవరాలు తీర్చే వస్తువుల ఉత్పత్తిలో కీలకమైన పాలిమర్స్ వినియోగంలో భారత్ చాలా వెనుకబడి ఉందన్నారు. మన దేశంలో తలసరి పాలిమర్స్ వినియోగం కేవలం 10 కిలోలైతే, ప్రపంచంలో ఇది 30 కిలోలుగా ఉందన్నారు. తలసరి 100కిలోల కిలోల పాలిమర్స్ వినియోగంతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. స్వచ్ఛ ఇండియాలో భాగంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచింతంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. దేశంలో సిలిండర్ల సగటు వినియోగం 7 ఉండగా, ఉజ్వల యోజన పథకంలో 5 సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇంధనంలో కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని 20 శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతికత, ఆధునికీకరణ తదితర అంశాల్లో కొంతమేర అంతరమేర్పడిందన్నారు. కార్యక్రమంలో భాగంగా రిఫైనరీ ఎనర్జీ పెర్ఫార్మెన్స్ విభాగంలో పలు రిఫైనరీలకు మంత్రి ధర్మేంద్రప్రదాన్ చేతుల మీదుగా షీల్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో పెట్రోలియం శాఖ కార్యదర్శి డికె త్రిపాఠి, పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి (రిఫైనరీస్) సందీప్ పౌండ్రిక్ తదితరులు ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చమురు శుద్ధి కర్మాగారాల ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

చిత్రం..21వ రిఫైనరీ టెక్నాలజీ మీట్‌లో మాట్లాడుతున్న పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్