బిజినెస్

రూపాయకే బంగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటియం తమ ఖాతాదారుల కోసం ‘డిజిటల్ గోల్డ్’ పేరుతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారం క్రయ విక్రయాలు జరిపేలా ఖాతాదారులకు వీలు కల్పించే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఎంఎంటిసి-పిఎఎంపితో పేటియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా ఖాతాదారులు అతితక్కువగా కేవలం ఒక్క రూపాయితో కూడా 999.9 స్వచ్ఛతతో కూడిన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. పేటియం మొబైల్ వ్యాలెట్లను ఉపయోగించుకుని ఖాతాదారులు ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా దానిని ఉచితంగా ఎంఎంటిసి-పిఎఎంపి సెక్యూర్ వాల్ట్స్‌లో నిల్వ ఉంచుకునేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నాణేల రూపంలో ఖాతాదారులు నేరుగా తమ ఇళ్లకు తెప్పించుకోవడంతో పాటు మళ్లీ దానిని ఆన్‌లైన్ ద్వారా ఎంఎంటిసి-పిఎఎంపికి అమ్ముకోవని పేటియం వ్యవస్థాపక సిఇఓ విజయ్ శేఖర్ శర్మ, ఎంఎంటిసి-పిఎఎంపి చైర్మన్ మెహిదీ బర్ఖోర్దర్ గురువారం న్యూఢిల్లీలో విలేఖరులకు వివరించారు.