బిజినెస్

సెల్ఫ్ డిక్లరేషన్ చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఉద్యోగ భవిష్య నిధి(ఇపిఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఇపిఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునే చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. దాన్ని కార్యాలయంలో అందచేసి విత్‌డ్రా చేసుకోవచ్చని ఇపిఎఫ్‌ఓ వెల్లడించింది. దీనికి సంబంధించి ఈనెల 25న కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఇపిఎఫ్ చందాదారుడు పనిచేస్తున్న సంస్థ యజమాని సంతకం గానీ, డాక్టర్ సర్ట్ఫికెట్లు గానీ ఇవ్వనక్కర్లేదు. నగదు విత్‌డ్రాకు ఆసుపత్రి బిల్లులపై చందారుడే సంతం చేస్తే సరిపోతుందని ఇపిఎఫ్‌ఓ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ప్రారంభించిన సెల్ఫ్ డిక్లరేషన్ విధానానికి అనుగుణంగానే ఇపిఎఫ్‌లోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. పిఎఫ్ అడ్వాన్స్ విషయంలోనూ చందాదారుడికి అనేక వెసులుబాట్లు కల్పించినట్టు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విపి జాయ్ తెలిపారు. కాంపోజిట్ క్లయిం ఫోరం అందజేసి సులభంగా పిఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
తీవ్రమైన అనారోగ్యానికి గురై కనీసం నెల రోజులు ఆసుపత్రిలో ఉండి ఉంటే ఇపిఎఎఫ్ ఖాతాలోంచి ఆరు నెలల జీతం విత్‌డ్రా చేసుకోవచ్చు. శస్త్ర చికిత్స లేదా టిబి, కుష్ఠు, పక్షవాతం, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు ఎఎఫ్ సేవింగ్స్ ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు విత్‌డ్రాలు కొంత ఇబ్బందిగానే ఉండేది. పనిచేస్తున్న కంపెనీ నుంచి, అలాగే వైద్యుడి నుంచి ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రుల బిల్లులపై చందాదారుడు సంతకం ఉంటే సరిపోతుంది.