బిజినెస్

మారుతి సుజుకి లాభాలు అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆటో దిగ్గజం మారుతి సుజుకి గత ఆర్థిక సంవత్సరం నికర లాభాలు ఏకంగా 36.6 శాతం పెరిగి రూ. 7,511 కోట్లకు చేరుకున్నాయి. కాగా, నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు 15.8 శాతం పెరిగాయి. మారుతి సుజుకి గురువారం తన చివరి త్రైమాసికం ఫలితాలతో పాటుగా వార్షిక ఫలితాలను ప్రకటించింది. 2015-16లో కంపెనీ నికర లాభం రూ.5,497.2 కోట్లుగా ఉంది. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ అమ్మకాలు రూ. 66,909.4 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 18.5 శాతం ఎక్కువ. కాగా మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సైతం 9.8 శాతం పెరిగి 15,68, 603 యూనిట్లుగా ఉండగా, ఇందులో ఎగుమతులు 1,24,062 యూనిట్లు ఉన్నాయని మారుతి సుజుకి తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూడా కంపెనీ రికార్డు వార్షిక లాభాలు నమోదు చేసింది. కాగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ. 75 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. అంతకుముందు సంవత్సరంలో కంపెనీ ప్రతి షేరుకు 35 రూపాయల డివిడెండ్ చెల్లించింది. నోట్ల రద్దు కారణంగా ఈ ఏడాది ఒక విధంగా సవాళ్లతో కూడుకున్నదని, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అనేక చెడు పరిణామాలు సంభవిస్తాయని భావించారని, అయితే అలా జరగలేదని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ చెప్పారు. ఉత్పత్తి పెరుగుదల, పైస్థాయి మోడల్స్‌లో కంపెనీ వాటా పెరుగుదల, పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల వల్ల కలిగిన ప్రయోజనాలు అన్నీ కలిపి లాభాలు పెరగడానికి దోహదపడ్డాయని ఆయన చెప్పారు. సుమారు 23 వేల కోట్ల రూపాయల మేరకు ఉన్న నగదు నిల్వలను కంపెనీ దేశంలో అమ్మకాలు, సేవల నెట్‌వర్క్‌ను పెంచడానికి ఉపయోగించుకుంటుందని భార్గవ చెప్పారు.