బిజినెస్

‘ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 28: రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నవ్యాంధ్ర ఇంధన వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కర్నూలులో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంతో మాట్లాడుతూ ప్రస్తుతం కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల పరిసర ప్రాంతాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. రానున్న రోజుల్లో మిగతా పనులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి కేంద్రంగా ఇది కీర్తి పొందనుందన్నారు. 2022 నాటికి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో నిర్మించనున్న సౌర విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా మరో 9 వేల మెగావాట్ల విద్యుదు త్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి సహకరించిన గని, శకునాల గ్రామాల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అందులో ఇప్పటికే 8 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం పనులు చేపట్టామని వెల్లడించారు. సౌర విద్యుదుత్పత్తి కేంద్రం పూర్తయితే వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని, రైతులకు భారీ సబ్సిడీపై సౌర విద్యుత్ మోటార్లు పంపిణీ చేస్తామన్నారు. కాగా, గత రెండేళ్లలో రాష్ట్రంలో అధిక విద్యుదుత్పత్తి జరుగుతోందని, గతంలో విద్యుత్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి గట్టెక్కామన్నారు. గృహ వినియోగదారులకు 24 గంటలు, రైతులకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం పూర్తయితే రానున్న నాలుగేళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కూడా 24 గంటలు విద్యుత్ అందించగలమన్నారు.