బిజినెస్

మండీ వ్యాపారుల మాయాజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మే 1: ఈ ఏడాది మామిడి దిగుబడి ఎక్కువ రావడంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని భావించిన మామిడి తోటల కొనుగోలుదారులకు చుక్కెదురైంది. మార్కెట్ మాయగాళ్లు ధర తగ్గించేసి దోపిడీ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 47 వేల హెక్టార్లలో మామిడితోటలు సాగు చేశారు. హెక్టారుకు 9 టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా జిల్లాలో మామిడి వ్యాపారంపైనే ఆధారపడ్డ కుటుంబాలు 2 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో కదిరి, పెనుకొండ డివిజన్లలో అత్యధికంగా ఉన్నారు. ఏటా అనంతపురం జిల్లాలోనే కాకుండా కర్ణాటక, తెలంగాణల్లో లక్షలు వెచ్చించి మామిడి తోటలు కొనుగోలు చేస్తుంటారు. మామిడి తోట విస్తీర్ణంతోపాటు మామిడి చెట్ల వయసు, సంఖ్యను బట్టి ధర నిర్ధారిస్తారు. ఏడాది లేదా రెండేళ్ళపాటు పంట తీసుకునేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుని మామిడి తోట యజమానికి నిర్దేశించిన మొత్తాన్ని లక్షల్లో చెల్లిస్తుంటారు. నిరుడు జిల్లాలో కనీసం 40 శాతం పంట కూడా దిగుబడి రాలేదు. దీంతో మామిడి తోటలు తీసుకున్న వ్యాపారులు భారీ మొత్తాల్లో నష్టపోయారు. అయితే ఈ ఏడాది దిగుబడి రెండు నెలల ముందుగానే వచ్చింది. దీంతో ముందే పంట వచ్చిన వ్యాపారులు కిలో 50 నుంచి 70 రూపాయల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అలాంటివారు తక్కువ మందే ఉన్నారు. కానీ పంట పూర్తిస్థాయిలో ఒకేసారి కోతకు రావడంతో మార్కెట్‌ను కాయలు ముంచెత్తడం, ధరలు అమాంతం పడిపోవడం జరిగిపోయాయ. దిగుబడి వచ్చిన మామిడిని గతంలోలా కాకుండా పచ్చి కాయలనే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని కొత్తపేట మార్కెట్‌లో మామిడి ధరలు కొంతవరకు ఎక్కువ ఉండడంతో జిల్లాలోని మామిడి వ్యాపారులు 80 శాతం మంది హైదరాబాద్‌కే తరలించారు. ప్రతి రోజు కేవలం అనంతపురం జిల్లానుంచే 2,000 టన్నుల మామిడి హైదరాబాద్‌కు వచ్చింరు. అయితే ఇక్కడే మండీ నిర్వాహకులు వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. మార్కెట్‌లో ధర ఎక్కువగా పలుకుతోందని తొలుత ముమ్మరం ప్రచారం చేయిస్తుండటంతో వ్యాపారులు పొలోమంటూ తమ పంటను పెద్దమొత్తంలో తీసుకువస్తున్నారు. తీరా పంట మార్కెట్‌కు చేరగానే మండీ నిర్వాహకులు మాట మార్చడం షరామామూలుగా మారుతోంది. ఈరోజు పంట ఎక్కువగా వచ్చిందని, కాబట్టి ముందుగా చెప్పినంత ధర ఇవ్వలేమని చావుకబురు చల్లగా చెబుతున్నారు. దీంతో రవాణా చార్జీలకు జడిసి వ్యాపారులు అయిన కాడికి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. మండీ నిర్వాహకుల నిర్వాకం వల్ల ధర అమాంతం పడిపోతోంది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పాటు మామిడి జ్యూస్ తయారు చేసే కంపెనీలు సైతం ఇదే ఫార్ములా అమలు చేస్తున్నాయి. తక్కువ ధరకు మామిడిని తెప్పించుకోవడానికి పంట కోతకొచ్చే సమయంలో జ్యూస్ ఫ్యాక్టరీలను కొద్దిరోజుల పాటు మూసి వేస్తున్నారు. ఫలితంగా ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకురాక ధర పడిపోతోంది. ఒక్కసారి మార్కెట్‌లో సరుకు దించాక అక్కడ వారు చెప్పిందే వేదం, వారు నిర్ణయించిందే ధర. దీంతో మార్కెట్‌కు తీసుకెళ్ళిన మామిడికాయలను వెనక్కి తీసుకురాలేక అక్కడే కిలో 8 నుంచి 15 రూపాయలలోపు అమ్ముకుని ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా మిగలని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మార్కెట్‌లో ధర పడిపోవడంతో వ్యాపారులు తోపుడుబండ్లు, ఆటోల్లో వీధివీధి తిరుగుతూ కిలో 25 నుంచి 30 రూపాయల వరకు అమ్ముకోవడం కూడా కనిపిస్తోంది. రైతులకు సొమ్ము చెల్లించేందుకు ఇలా చేయక తప్పడం లేదని వారంటున్నారు.
తోటలకు వెచ్చించిన డబ్బులూ రాలేదు
‘12 లక్షల రూపాయలు వెచ్చించి 4 తోటలను ఒక్క ఏడాది పంట కోసం లీజుకు తీసుకున్నా. పంట చేతికొచ్చిన 20 రోజులపాటు మార్కెట్‌లో టన్ను 40 వేల నుంచి 48 వేల రూపాయల వరకు పలికింది. ఈ ఏడాది లాభాల పంటేనని ఆనందించాను. అయితే ఒక్కసారిగా మార్కెట్‌లో టన్ను ధర 10 వేల నుంచి 15 వేల రూపాయలకు పడిపోయింది. తోటలకు వెచ్చించిన డబ్బు రావడం కూడా కష్టమే. దిగుబడి ఎక్కువగా ఉందని మార్కెట్ల నిర్వాహకు లు, జ్యూస్ ఫ్యాక్టరీలవాళ్ళు ఏకమై ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే వెళ్ళండని చిన్నచూపు చూస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్య లు తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలి.’ నల్లమాడకు చెందిన వ్యాపారి జాకీర్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం..హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కొత్తపేట మార్కెట్‌లో మామిడి కాయల రాశులు