బిజినెస్

డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 1: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. వివిధ కాలపరిమితి గల తమ టర్మ్ డిపాజిట్ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. కోటి రూపాయల దిగువన ఉన్న మధ్య, ధీర్ఘకాలిక డిపాజిట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీంతో రెండు నుంచి మూడేళ్ల డిపాజిట్లకు ఎస్‌బిఐ ఇచ్చే వడ్డీరేటు 6.25 శాతానికి పడిపోయింది. ఇంతకుముందు ఇది 6.75 శాతంగా ఉంది. ఇంతే కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు సినియర్ సిటిజన్లకైతే 6.75 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఇంతకుముందు 7.25 శాతంగా ఉంది. కాగా, మూడేళ్ల నుంచి 10 ఏళ్ల వరకున్న డిపాజిట్ల వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గత నెల 29 నుంచే మార్పులు వర్తిస్తాయంది.