బిజినెస్

ఆమ్టెక్ ఆటో ఏకీకృత నికర నష్టం రూ. 987 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఆటో కంపోనెంట్ మేకర్ ఆమ్టెక్ ఆటో ఏకీకృత నికర నష్టం ఈ సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 987 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే వ్యవధిలో 848.21 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఈ సంస్థ అందుకోవడం గమనార్హం. ఆదాయం ఈసారి 15,213.4 కోట్ల రూపాయలుగా ఉండగా, పోయినసారి 15,706.6 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, స్టాండలోన్ ఆధారంగా సంస్థ నికర నష్టం ఈ జూలై-సెప్టెంబర్‌లో 158.62 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది లాభం 74.37 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 1,042.1 కోట్ల రూపాయల నుంచి 833.8 కోట్ల రూపాయలకు తగ్గింది. అక్టోబర్-సెప్టెంబర్ వ్యవధిని ఈ సంస్థ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

ఎయిర్ ఏషియా ఇండియా
నష్టం రూ. 65 కోట్లు
న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా నికర నష్టం ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో గతంతో పోల్చితే మరింతగా పెరిగింది. ఈ జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 65 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్‌లో ఈ నష్టం సుమారు 25 కోట్ల రూపాయలుగా ఉంది. మలేషియాకు చెందిన ఏయిర్ ఏషియా బెర్హద్‌తో కలిసి టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ ఏయిర్ ఏషియా ఇండియా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. గత ఏడాది ఈ జాయింట్ వెంచర్ విమానయాన కార్యకలాపాలను ప్రారంభించినది తెలిసిందే.

వచ్చేవారం రెండు ఐపిఒలు

న్యూఢిల్లీ, నవంబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో కదలాడుతున్న నేపథ్యంలో మదుపరుల కొనుగోళ్ళ సెంటిమెంట్‌ను అందిపుచ్చుకోవాలని ఆల్కెమ్ లాబొరేటరీస్, డాక్టర్ లాల్‌పథ్ ల్యాబ్స్ వచ్చే వారం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపిఒ) ద్వారా క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ ఐపిఒలు వస్తుండగా, డిసెంబర్ 8-10న ఐపిఒ ప్రారంభిం చాలని ఇరు సంస్థలు యోచిస్తున్నాయి. ఆల్కెమ్ లాబొరేటరీస్ ఐపిఒ 1,350 కోట్ల రూపాయలవగా, డాక్టర్ లాల్‌పథ్ ల్యాబ్స్ 600 కోట్ల రూపాయల ఐపిఒను తెస్తోంది.

పసిడి నగదీకరణ పథకంపై రేపు సమీక్ష
న్యూఢిల్లీ, నవంబర్ 29: పసిడి నగదీకరణ పథకంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రతినిధులతో, బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం సమీక్షా సమావేశం జరపనుంది. ఈ నెల 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకానికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన పథకంపై సమీక్షా సమావేశం జరుగుతోంది. కాగా, ఈ పథకం విజయవంతానికి పలు సంస్థలు, ఆలయాలతో బ్యాంకర్లు చర్చలు జరుపుతున్నారని ఆర్థిక శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.