బిజినెస్

అమెరికా సహకారం డిపిఆర్ తయారీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 1: స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో అమెరికా సహకారం కేవలం డిపిఆర్‌ల తయారీకి మాత్రమేనట. దేశంలో విశాఖపట్నం, అలహాబాద్, అజ్మీర్ నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి అమెరికా ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తుందని ప్రకటించడమే కాకుండా తన అమెరికా పర్యటనలో సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుని నోట హామీ ఇప్పించారు. ఇంకేముంది దేశంలో మూడు నగరాలు అమెరికా ఆర్థిక సాయంతో స్మార్ట్‌సిటీలుగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతాయని అంతా భావించారు. అయితే స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సవివర పథక నివేదిక(డిపిఆర్)లు తయారు చేసేందుకు మాత్రమే అమెరికా సహకరిస్తుందని ప్రస్తుతం సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలాఉంటే స్మార్ట్‌సిటీల్లో వౌలిక వసతుల కల్పన, ప్రజాజీవనం మెరుగు, ఇతర అంశాల విషయంలో అమెరికా అనుమతించిన సంస్థ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ) కేవలం ప్రతిపాదనలు మాత్రమే ఇస్తుంది. ఇది కూడా అమెరికా ఆర్థిక సాయంతోనో, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతోనో జరగదు. నగరాల్లో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలో అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు చేస్తాయి. ఇక దేశంలోని 100 పట్టణాలను గుర్తించి, వాటిలో ఎంపిక చేసిన 20 పట్టణాలను మాత్రమే స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీగా అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే పట్టణాల ఆర్థిక స్థితి, పాలనా సంస్కరణలను పరిశీలించిన మీదట కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. అయితే ప్రధాని మోదీ తొలిసారిగా ప్రకటించిన మూడు నగరాల్లో మాత్రం స్మార్ట్‌సిటీకి అవసరమయ్యే డిపిఆర్‌లను తయారు చేసేందుకు యుఎస్‌టిడిఎ ఆర్థిక సాయం అందిస్తుంది.

10 లక్షల ఉద్యోగాలకు
అవకాశం!

న్యూఢిల్లీ, జనవరి 1: నిరుద్యోగులకు శుభవార్త. ఈ నూతన సంవత్సరం ఆయా సంస్థలు 10 లక్షలకుపైగా నియామకాలను జరపాలని భావిస్తున్నాయి. అంతేకాదు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తే వేతనాల్లో 10 నుంచి 30 శాతం వృద్ధిని కూడా చవిచూస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హెచ్‌ఆర్ నిపుణుల ప్రకారం గత ఏడాది ఉద్యోగ నియామకాలు జోరుగా జరిగాయని, ఈ ఏడాది కూడా అలాగే జరగడానికి అవకాశాలున్నాయి. ‘దేశంలోని సంస్థాగత రంగం ఈ ఏడాది 2016లో సుమారు 10 లక్షల కొత్త ఉద్యోగాలను చేపట్టనున్నాయి.’ అని మైహైరింగ్‌క్లబ్ డాట్‌కమ్, జాబ్‌పోర్టల్ డాట్‌కోడాట్‌ఇన్ సిఇఒ రాజేశ్ కుమార్ అన్నారు. ఉద్యోగాల కోసం అనే్వషిస్తున్న వారికి ఈ ఏడాది ఆశించిన ఫలితాలను అందిస్తుందని నౌకరీ డాట్‌కమ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి సురేశ్ సైతం తెలిపారు.

రూ. 2.50 లక్షల కోట్లకు
ఈ-కామర్స్ ఆదాయం

న్యూఢిల్లీ, జనవరి 1: భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ ఆదాయం ఈ ఏడాది దాదాపు 2.50 లక్షల కోట్ల రూపాయల (38 బిలియన్ డాలర్లు) మార్కును తాకే అవకాశం ఉందని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. గత ఏడాది 23 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయాన్ని దేశీయ ఈ-కామర్స్ సంస్థలు అందుకున్నాయి. ఆన్‌లైన్ డిస్కౌంట్లు ఈ-కామర్స్ సంస్థల వ్యాపారాన్ని పెంచుతున్నాయని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు. స్మార్ట్ఫోన్ల ద్వారానే అత్యధికంగా ఆన్‌లైన్ షాపింగ్ జరుగుతోందని చెప్పారు. ఆన్‌లైన్ షాపర్లలో 65 శాతం మగవారు, 35 శాతం ఆడవారున్నారు.

రిటైల్ మార్కెట్‌లోకి
పట్టుబడిన పప్పు ధాన్యాలు
1.12 లక్షల టన్నులు విడుదల

న్యూఢిల్లీ, జనవరి 1: దేశవ్యాప్తంగా అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న పప్పు్ధన్యాల్లో 1.12 లక్షల టన్నులను కేంద్ర ప్రభుత్వం రిటైల్ మార్కెట్‌లోకి తరలించింది. రిటైల్ మార్కెట్‌లో ఎగిసిన పప్పు ధాన్యాల ధరలను అదుపులోకి తీసుకురావడంలో భాగంగా, డిమాండ్‌కు తగ్గ సరఫరా జరిగేలా చూడటానికే పట్టుబడిన పప్పు ధాన్యాలను రిటైల్ మార్కెట్‌కు తరలిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఒకానొక సమయంలో కిలో కందిపప్పు, మినపపప్పు రూ. 200లను అధిగమించినది తెలిసిందే. 2015 డిసెంబర్ 31 వరకు పట్టుబడిన అక్రమ పప్పు నిల్వలు 1,12,545.96 టన్నులుగా ఉన్నాయి.