బిజినెస్

కొల్లాపూర్‌లో విస్తారంగా మామిడి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, మే 10: నోరూరించే మామిడి పండ్లకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ఎంతో ప్రసిద్ధి. బంగినపల్లి మామిడి పండ్లకు ఎంత పేరుందో కొల్లాపూర్ మామిడి పండ్లకు కూడా అంతే పేరుంది. తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల హెక్టార్లలో పండ్ల సాగు జరుగుతుం డగా, యేటా 2.2 లక్షల టన్నుల మామిడి ఫలాలు ఉత్పత్తి అవుతున్నాయి.
కొల్లాపూర్ ప్రాంతంలో జట్‌ప్రోల్ సంస్థానాధీశులు ఎక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలు పెంచి ఇతర రైతుల పొలాలకు కూడా విస్తరించారు. దాదాపు నియోజకవర్గంలో 22.50 వేల హెక్టార్లలో సాగుకు యోగ్యమైన భూములుండగా, అందులో 5 వేల హెక్టార్లలో మామిడి తోటలు పెంచుతున్నారు. జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల, కోడేరు మండలాలు మామిడి పండ్లకు ప్రసిద్ధిగాంచాయి. ప్రత్యేకించి కొల్లాపూర్ మామిడి.. శ్రాస్తజ్ఞుల ప్రశంసలను అందుకుంటోంది. మామిడి రకాలలో రారాజైన బేనిషాన్, కొల్లాపూర్ బేనిషాన్‌గా అన్ని ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది. మంచి నాణ్యత గల ఈ పండ్లు కొల్లాపూర్ నుండే ఎగుమతి చేస్తారు. దీనినే నఫేదా అని కూడా పిలుస్తారు. పండ్ల సైజు పెద్దగా ఉండి అండాకారంలో పసిడి రంగు కలిగి ఉంటుంది. తోలు పలుచగా ఉండి నాడగట్టి ముద్దలా ఉండి పీచు లేకుండా ఉంటుంది. ఎక్కువకాలం నిల్వ చేసేందుకు, రవాణా చేసేందుకు పనికి వస్తాయి. మొత్తం కొల్లాపూర్ ప్రాంతంలోని మామిడి తోటల విస్తీర్ణంలో 80 శాతం బేనిషాన్ రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు.
మిగిలిన 20 శాతం విస్తీర్ణంలో పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసం, నఫేదా ఆమ్, పంచదార, కలశం, సువర్ణరేఖ, రాణి పసందు, మల్కొబి, కలెక్ట పసందు, నీలం, తోతాపరి వివిధ రకాలు పోతపండ్లు కనిపిస్తాయి. అలాగే నూజివీడు పచ్చడి రకం ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి. ఈ రకం కాయలను కూరగాయలకు, (చట్నీలకు) అధికంగా ఉపయోగిస్తారు. కొల్లాపూర్ ప్రాంతంలో ఈ రకాలేగాక సంకరజాతి రకాలైన నీలేషాన్, స్వర్ణ, జాంగీర్, మంజీరా మొదలైన రకాల పండ్లను పండిస్తారు. కాగా, వర్షాభావ పరిస్థితుల వల్ల మామిడి దిగుబడి ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని, అందులో బేనీషాన్ దిగుబడి మరింత పడిపోయిందని రైతు బిచ్చన్న అన్నారు. 10 సంవత్సరాల చెట్లు కాపునకు రాలేదని తెలిపారు. తక్కువ రోజులకే మామిడి మార్కెట్ ముగుస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు. అఖిల భారత పండ్ల ప్రదర్శనలో కొల్లాపూర్ రాజాగార్డెన్‌లోని మామిడి పండ్లకు 1960లో ప్రథమ బహుమతి లభించింది. మామిడి పండ్లను ఇతర ప్రాంతాల నుండి తెచ్చి ఈ పండ్లు కొల్లాపూర్ పండ్లంటూ చెబుతూ కొంతమంది వ్యాపారస్తులు అమ్ముకుంటున్నారు. మెక్సికో, థాయిలాండ్, చైనా, బ్రెజిల్, పాకిస్తాన్ వంటి 63 దేశాలలో మామిడి సాగు అవుతున్నా వివిధ రకాల మామిడి పండ్ల ఉత్పత్తిలో మొత్తం ప్రపంచ దేశాలలో 61 శాతం పేరు ప్రతిష్టలు భారతదేశానికి దక్కుతాయ.
మొత్తం పండ్లలో 41 శాతం ఒక్క మామిడి పండ్లే ఎగుమతి అవుతున్నాయి. దేశంలో 120 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఎంతో విదేశీ మారకద్రవ్వాన్ని ఆర్జించే అవకాశాలు ఉన్నప్పటికీ ఎగుమతులు చేయడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

చిత్రం..కొల్లాపూర్ బేనిషాన్ మామిడి పండ్లు