బిజినెస్

విశాఖ- కొలంబో విమాన సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 11: విశాఖ నుంచి సింగపూర్, దుబాయ్, మలేషియాకు అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. జూలై 8 నుంచి నుం చి కొలంబోకు నేరుగా విమాన సర్వీసును శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ నడపబోతోంది.
అంతేకాదు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మరో 16 దేశాలకు టిక్కెట్‌లో 20 శాతం రాయితీతో సరికొత్త ప్యాకేజిని ప్రకటించింది. టూర్ అండ్ ట్రావ ల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ నుంచి కొలంబోకు వారానికి నాలుగు రోజులు అంటే మంగళ, గురు, శని, ఆదివారాల్లో విమాన సర్వీసులు నడపనున్నా రు. ఈ విమానం కొలంబో నుంచి ఉదయం 7.10 గంటలకు బయల్దేరి విశాఖకు 9.10 గంటలకు చేరుకుంటుంది. విశాఖలో అదే రోజు 10.10 గంటలకు బయల్దేరి మధ్యా హ్నం 12.15 గంటలకు కొలంబో చేరుకుంటుంది. ఈ నెల 17లోగా టిక్కెట్‌లు బుక్ చేసుకున్న వారికి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్ కౌలాలంపూర్, సింగపూర్‌కు దేశాలకు రాయితీలతో కూడిన టిక్కెట్‌లను జారీ చేయనుంది.
అలాగే, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తన సర్వీసులలో బీజింగ్, షాంఘాయ్, టోక్యో, లండన్, జకార్తా, హాంకాంగ్, మాలే, సీషెల్, దుబాయ్, బెహరైన్, మస్కట్, అబుదాబి, దోహ, రియాద్, జడ్డాకు వెళ్లే వారికి టిక్కెట్‌లలో 20 శాతం రాయితీ ప్రకటించింది.

చిత్రం..విలేఖరుల సమావేశంలో నరేష్‌కుమార్