బిజినెస్

హెచ్‌సిఎల్ ఫలితాలు అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: ఓ పక్క ప్రపంచ దేశాలనుంచి వీసాల సమస్యలు, మరో వైపు ఐటి రంగంలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజాల్లో ఒకటయిన హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2017 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. మార్కెట్ అంచనాలను మించి ఈ లాభాలు ఉండడం గమనార్హం. నాలుగో త్రైమాసికంలో కంపెనీ 2091 కోట్ల రూపాయల లాభం నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేయగా, వాస్తవ ఫలితాలు ఆ అంచనాలను మించిపోవడం విశేషం. 2017 జనవరి-మార్చి త్రైమాకానికి కంపెనీ 2,475.27 కోట్ల రూపాయల నికర లాభా న్ని ఆర్జించినట్లు హెచ్‌సిఎల్ బిఎస్‌కి సమర్పించిన ఓ ప్రకటనలో తెలియజేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 27 శాతం పెరిగింది. గత ఏడాది చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1938.66 కోట్లుగా ఉన్నట్లు హెచ్‌సిఎల్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)కి సమర్పించిన ఒక నివేదికలో తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 6 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను కూడా కంపెనీ డైరెక్టర్లు ప్రకటించారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం సైతం 20 శాతానికి పైగా పెరిగి 13,18 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ. 10,925 కోట్లుగా ఉంది. కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 53 శాతం పెరిగి రూ.8,606.47 కోట్లకు చేరుకోగా, మొత్తం ఆదా యం సైతం దాదాపు 52 శాతం పెరిగి రూ.48, 640.85 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం నిలకడయిన కరెన్సీ లెక్కల ప్రకారం 10.5 శాతంనుంచి 12.5 మధ్య పెరగవచ్చని హెచ్‌సిఎల్ అంచనా వేసింది. కాగా 2017 ఆర్థిక సంవత్సరానికి తాము అద్భుతమైన వృద్ధిని సాదించగలిగామని, తమ ఉద్యోగులు, కస్టమర్లు, వాటాదారులకు అత్యుత్తమ విలువలను అందించగలిగామని కంపెనీ అధ్యక్షుడు, సిఈఓ సి విజయ్ కుమార్ తెలిపారు.
ఈ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకుంది. 2017 మార్చి చివరి నాటికి కంపెనీలో మొత్తం 1.15, 973 మంది ఉద్యోగులున్నారు.