బిజినెస్

ఆడుకుంటున్న రేటింగ్ ఏజెన్సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 11: ప్రపంచ రేటింగ్ ఏజన్సీలపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ ఏజన్సీల పేరుతో అవి దేశాలతో ఆటలాడుంటున్నాయన్నారు. ముఖ్యంగా భారత్, చైనాల విషయంలో రేటింగ్ ఏజన్సీలు గత కొంతకాలంగా నిలకడలేని ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆయన అంటూ, వాటిని ‘పూర్ స్టాండర్డ్స్’ అని అభివర్ణించారు. ముఖ్యంగా భారత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా మెరుగైన ఆర్థిక పని తీరు ఉన్నప్పటికీ దాని ర్యాంకింగ్‌ను మార్చడం లేదని ఆయన విమర్శించారు. గురువారం ఇక్కడ వికెఆర్‌వి స్మారకోపన్యాసం చేస్తూ అరవింద్ సుబ్రమణ్యన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖాతాల పని తీరులాంటి ఆర్థిక ఫండమెంటల్స్ విషయంలో స్పష్టమైన మెరుగుదల ఉన్నప్పటికీ రేటింగ్ ఏజన్సీలు భారత్‌కు ‘బిబిబి’ రేటింగ్‌ను ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు చైనా ఫండమెంటల్స్ దిగజారినప్పటికీ దాని రేటింగ్‌ను ‘ఏఏ’కు అప్‌గ్రేడ్ చేస్తున్నాయని ఆయన అన్నారు. మరో విధంగా చెప్పాలంటే రేటింగ్ ఏజన్సీలు భారత్, చైనాల విషయంలో పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రేటింగ్ విశే్లషకులను మనం సీరియస్‌గా తీసుకోవాలా? అని కూడా సుబ్రమణ్యన్ ప్రశ్నించారు. అనేక ఆర్థిక సంక్షోభాల సమయాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో రేటింగ్ ఏజన్సీలు విఫమవుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యం గా అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన తనఖా రుణాల ఏజన్సీలకు ఈ సంస్థలు ‘ఏఏఏ’ రేటింగ్స్ ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు.
దేశీయంగా నిపుణుల విశే్లషణలకు, అధికారిక నిర్ణయాలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉంటోందని సుబ్రమణ్యన్ అన్నారు. విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నిపుణుల విశే్లషణలు భిన్నంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత విశే్లషణల ధ్వని,స్వరం మారుతున్నాయన్నారు. అధికారిక నిర్ణయాలను హేతుబద్దంగా విశే్లషిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోందని ఆయన చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, విధానాలను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటోందని అన్నారు. గతంలో కూడా భారత్ రేటింగ్ ఏజన్సీలు అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించడం తెలిసిందే.