బిజినెస్

ఐసిఐసిఐకి మొండి బకాయిల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 29: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికంలో ఏకంగా 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. మొండి బకాయిలు (నికర నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) పెద్ద మొత్తంలో పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో 87 శాతం క్షీణించి 406.71 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే సమయంలో బ్యాంక్ లాభం 3,084 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2015-16 అక్టోబర్-డిసెంబర్‌లో 3,122 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 76 శాతం దిగజారి 701.89 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు 2,922 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ఆదాయం మాత్రం 14.51 శాతం పెరిగి 18,590.86 కోట్ల రూపాయలకు చేరుకుంది. పోయినసారి 16,234.73 కోట్ల రూపాయలుగానే ఉంది. కాగా, మొండి బకాయిలు బ్యాంక్ లాభాన్ని విపరీతంగా దెబ్బతీశాయి. ఈ జనవరి-మార్చిలో 7,000 కోట్ల రూపాయల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. దీంతో నిరుడు జనవరి-మార్చిలో 3.78 శాతంగా ఉన్న బ్యాంక్ నిరర్థక ఆస్తులు కాస్తా ఈ జనవరి-మార్చిలో 5.82 శాతానికి పెరిగాయి. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) ప్రభావమే కారణం. ఇదిలావుంటే 2015-16 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే బ్యాంక్ నికర లాభం 9,726.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 68,062.48 కోట్ల రూపాయలుగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం 11,175.35 కోట్ల రూపాయలుగా, ఆదాయం 61,267.27 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
పడిపోయిన షేర్ల విలువ
జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ల విలువ శుక్రవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో 1.5 శాతం వరకు క్షీణించింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 1.48 శాతం నష్టపోయి 236.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 231.40 వరకు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోనూ 1.31 శాతం పడిపోయి 236.95 వద్ద నిలిచింది. ఫలితంగా ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ 2,054.69 కోట్ల రూపాయలు పతనమవగా, 1,37,586.31 కోట్ల రూపాయలకు చేరుకుంది.