బిజినెస్

దేశీయ విమానయానంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 20: దేశంలో విమానయాన రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని విమానయానశాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు కొత్త రాజధానిలో విమానాశ్రయం అభివృద్ధి చేస్తామన్నారు. విమానాలు నడిపేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకువస్తున్నాయని, వారికి ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందన్నారు. కాగా, విశాఖపట్టణం విమానాశ్రయంలో ఇటీవల ఎంపి దివాకర్‌రెడ్డి ప్రవర్తన దురదృష్టకరమని, సిసి పుటేజిలు పరిశీలిస్తున్నామని, సంఘటన పూర్వాపరాలు తెలుసుకుంటున్నామన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
విశాఖ నుంచి శ్రీలంకకు విమాన సర్వీసులు
విశాఖపట్నం: విశాఖ నుంచి వివిధ దేశాలకు వెళ్లే విమానాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పారిశ్రామికంగాను, టూరిజం హబ్‌గా మారుతున్న నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు కొత్తగా విమానాలను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీలంక ఎయిర్‌వేస్ విశాఖపట్నం నుంచి అదనంగా నాలుగు విమాన సర్వీసులను నడిపేందుకు అంగీకారం తెలిపింది. వారంలో నాలుగు సర్వీసులు విశాఖ, హైదరాబాద్ నగరాల నుంచి కొలంబోకి రాకపోకలు సాగిస్తాయి. వచ్చేనెల 8 నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఈ సర్వీసులు నడుస్తాయి.
అలాగే విశాఖ నుంచి ఆస్ట్రేలియా, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్, బెహరైన్, మలేషియా, మారిషస్, జపాన్, చైనా దేశాలకు కూడా విమాన సర్వీసులు నడుస్తాయి. జూలై నుంచి శ్రీలంక కార్గో విమానం ద్వారా సముద్ర ఉత్పత్తులు, దుస్తులు, మందులు కూడా రవాణా చేస్తారు. అలాగే బ్యాకాంగ్‌కు విశాఖ నుంచి నేరుగా అక్టోబర్ 28 తేదీ నుంచి విమానాలు నడుస్తాయ.