బిజినెస్

ఒక్క రూపాయకే ‘ముంద్రా’ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన తన ముంద్రా పవర్ ప్రాజెక్టులో 51 శాతం వాటాను దానినుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న గుజరాత్ లాంటి రాష్ట్రాలకు 1 రూపాయికే విక్రయిస్తామని టాటా పవర్ ప్రతిపాదించింది. రుణభారంతో పాటుగా నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం టాటా పవర్ ఈ ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టులో తాము కేవలం 49 శాతం వాటానే అట్టి పెట్టుకుని, విద్యుత్‌ను కొనుగోలు చేసే వారు గనుక అధిక ధరకు ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేసే పక్షంలో ఒక కాంట్రాక్టర్‌గా ప్రాజెక్టును నడుపుతామంటూ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటాపవర్‌కు చెందిన కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్ (సిజిపిఎల్) ఈ నెల ప్రారంభంలో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు ఓ లేఖ రాసింది. ముంద్రా పవర్ ప్రాజెక్టు నష్టాలు రూ.6,457 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని సిజిపిఎల్ సిఈఓ కృష్ణకుమార్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సిజిపిఎల్‌కు ఇప్పటికే రూ.10,159 కోట్ల రుణ బకాయిలున్నాయని, ప్రాజెక్టు లాభదాయకం కారణం కాకపోవడంతో రుణదాతలు కొత్తగా రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి సైతం ఆ లేఖ కాపీలను పంపించారు.