బిజినెస్

విద్యుదుత్పత్తి సంస్థలకు తగ్గిన కోల్ ఇండియా బొగ్గు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: ప్రభుత్వరంగ సంస్థ, బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-మే వ్యవధిలో విద్యుదుత్పాదక సంస్థలకు 64.7 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-మేలో 65.8 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయడంతో ఈసారి దాదాపు 2 శాతం తగ్గుముఖం పట్టినట్లైంది. గత నెల మేలో 32.8 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయగా, నిరుడు మే నెలలో 34 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసినట్లు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. దేశీయంగా థర్మల్ విద్యుత్ తయారీ ప్లాంట్లకు అత్యధికంగా బొగ్గును సరఫరా చేస్తున్నది కోల్ ఇండియానే. అయితే ఈసారి ఏప్రిల్-మే నెలల్లో కోల్ ఇండియా మొత్తం బొగ్గు సరఫరా 91.7 మిలియన్ టన్నులుగా ఉంది. క్రిందటిసారి ఏప్రిల్-మే నెలల్లో ఇది 88.2 మిలియన్ టన్నులుగా ఉంది. మే నెలలో చూసినట్లైతే 2 శాతం సరఫరా పెరిగింది. ఈసారి 46.4 మిలియన్ టన్నులుగా, పోయినసారి 45.5 మిలియన్ టన్నులుగా ఉంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికిపైగా కోల్ ఇండియా ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో 2020 నాటికి 100 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంపై కోల్ ఇండియా కనే్నసింది.