బిజినెస్

జైలు ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ తీసుకువచ్చిన పలు సంస్కరణలు సఫలీకృతమవుతున్నాయ. ముఖ్యంగా ఖైదీలతో పనిచేయిస్తుండటం, చేతి వృత్తుల్లో అనుభవమున్న వారిని ప్రోత్సహిస్తుండటం లాభిస్తోంది. దీంతో వారిలో నైపుణ్యత, వారి ఉత్పత్తుల నాణ్యతపై జైళ్ల శాఖ దృష్టి సారిస్తోంది. ఖైదీలు తయారుచేస్తున్న పలు రకాల ఉత్పత్తులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సరసమైన ధరలకు జైళ్ల శాఖ విక్రయిస్తోంది. అదేవిధంగా ఖైదీలకు రోజు రూ. 30 నుంచి 50 వరకు చెల్లిస్తోంది. ఖైదీల హస్త నైపుణ్యం ఫలితంగా వారు తయారు చేస్తున్న వస్తువులు ఆదరణ కూడా పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల 4.5 కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ తయారీ కోసం చర్లపల్లి జైలుకు పోలీసు శిక్షణ సంస్థ ఆర్డరు వచ్చిందని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ సోమవారం తెలిపారు. పోలీసుల శిక్షణకు ఉపయోగపడే వివిధ రకాల ఫర్నిచర్‌తోపాటు కరీంనగర్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల కోసం ఫర్నిచర్ ఆర్డర్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నేషనల్ బ్రాండ్ పేరిట జైళ్లలో తయారయ్యే వస్తువులను అధికారులు మార్కెటింగ్ చేస్తున్నారని, వీటిని ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు ఉత్తరాలను సైతం రాసినట్టు సింగ్ చెప్పారు. ఇప్పటికే కొన్ని విభాగాల అధికారులు.. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తనతోపాటు వారిలో దాగివున్న ప్రతిభను, చేతి వృత్తుల్లో నైపుణ్యతను ప్రోత్సహిస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తోందని డైరెక్టర్ జనరల్ వికె సింగ్ చెప్పారు. తమ ప్రయత్నాలతో జైలు జీవితం అనంతరం ఖైదీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.