బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి లాభం రూ. 3,460 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో గతంతో పోల్చితే 30.76 శాతం వృద్ధి చెందింది. 3,460.46 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ లాభం 2,646.35 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆధారంగా ఈసారి 2,607.05 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,862.43 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక మొత్తం 2015-16లో సంస్థ ఏకీకృత లాభం 16.29 శాతం పెరిగి 10,190.26 కోట్ల రూపాయలుగా ఉంది. 2014-15లో ఇది 8,762.62 కోట్ల రూపాయలుగా నమోదైంది. స్టాండలోన్ ఆధారంగా గత ఆర్థిక సంవత్సరం 7,093.1 కోట్ల రూపాయలుగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 5,990.14 కోట్ల రూపాయలుగా ఉంది. ఇకపోతే తుది డివిడెండ్‌గా ఒక్కో షేర్‌కు 14 రూపాయల చొప్పున హెచ్‌డిఎఫ్‌సి సిఫార్సు చేసింది. మధ్యంతర డివిడెండ్ 3 రూపాయలకు ఇది అదనం అని సోమవారం స్పష్టం చేసింది.