బిజినెస్

పర్యాటక ప్రాంతాల్లో లేపాక్షి కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూలై 13: పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో లేపాక్షి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు, అలాగే విదేశాల్లో సైతం లేపాక్షి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్టు ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఛైర్మన్ పాలి ప్రసాద్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రులో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హస్తకళాకారులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 13 లేపాక్షి విక్రయ కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా వివిధ హస్తకళాకారులు చేసిన వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. అయితే వాటిలో కొన్ని కేంద్రాలే బాగున్నాయని తెలిపారు. దీంతో కొన్ని మూసివేసే స్థితికి వచ్చాయన్నారు. రాష్ట్రంలో తిరుపతితో పాటు విశాఖలోని లేపాక్షి కేంద్రాలు అమ్మకాలు బాగున్నాయన్నారు. అయితే పుట్టపర్తిలో విక్రయ కేంద్రం గతంలో బాగుండేదని, బాబా మరణంతో అక్కడ అమ్మకాలు లేకుండా పోయాయని, దీంతో ఆ కేంద్రాన్ని మూసివేసినట్టు తెలిపారు. అలాగే మరికొన్ని కేంద్రాల పరిస్థితి ఉందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కొంతవరకు సంస్థ బాగుందన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తున్నా అవి కేవలం కేంద్రాల ఏర్పాటులో భవనాల నిర్మాణాలకు మాత్రమే ఇస్తుందన్నారు. ప్రస్తుతం లేపాక్షి కేంద్రాల ద్వారా సంవత్సరానికి 35 నుంచి 40 కోట్ల టర్నోవర్ జరుగుతోందని, ఇందులో హస్తకళాకారులకు ఇవ్వగా పోను మిగిలినవి సంస్థ ఉద్యోగులకు సరిపోతుందన్నారు. అమ్మకాలను మరింత పెంచడం ద్వారా హస్తకళాకారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా టూరిస్టులు ఎక్కుగా ఉండే ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయటంతోపాటు విదేశాలకు మన కళాకారులు తయారుచేసిన వస్తువులను ఎగుమతి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్టు ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హస్తకళలపై శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుచేసి వారే తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో లేపాక్షి మేనేజర్ ఎస్‌కె షిరాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖర్లతో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఛైర్మన్ ప్రసాద్