బిజినెస్

అగ్రికల్చర్ బయో పెస్టిసైడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో అగ్రికల్చర్ బయో పెస్టిసైడ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు స్పెయిన్ దేశానికి చెందిన సిపాస కంపెనీ ఆసక్తి చూపింది. యూనిట్ ఏర్పాటుకు భూమిని కేటాయిస్తే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిపాస కంపెనీ ప్రతినిధులు టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లును పరిశ్రమ భవన్‌లో కలిశారు కూడా.
బయో పెస్టిసైడ్ ఉత్పత్తుల్లో తమ కంపెనీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని సిపాస కంపెనీ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో ఎస్పినోస ఎస్క్రిగ్, ఆ కంపెనీకి భారత్ నుంచి ముడిసరుకులు సరఫరా చేసే బయో ఇండియా బయోలాజికల్స్ కార్పొరేషన్ సిఇఒ శ్రీరామ్ గంగాధర్‌లు తెలిపారు. సిపాస కంపెనీ టర్నోవర్ 25 మిలియన్ అమెరికా డాలర్లు కలిగి ఉందని చెప్పారు. ఆసియాలో చైనా, భారత దేశాల్లో పరిశ్రమల యూనిట్లను నెలకొల్పేందుకు సిపాస కంపెనీ ఆసక్తి కనబరుస్తోందని అన్నారు. కాగా, సిపాస కంపెనీ ప్రతినిధులతో చర్చించిన అనంతరం టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ తగిన ప్రాజెక్టు రిపోర్టుతో వస్తే సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
తమ రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ముందు కు వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చి దిద్దే క్రమంలో రైతులకు ప్రయోజనకరమైన పురుగు మందుల తయారీ పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరమని బాలమల్లు అభిప్రాయపడ్డారు.