బిజినెస్

సింగరేణికి మరోసారి జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో ఎక్స్‌లెన్స్ ఇన్‌కాస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు వరుసగా రెండోసారి లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఆర్థిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను ఈ అవార్డును ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సింగరేణి సంస్థకు ప్రకటించింది. ఈ సంస్థ ప్రతి ఏడాది అత్యుత్తమ, గుణాత్మకమైన కాస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అవలంభించే పరిశ్రమలకు గుర్తింపును ఇస్తూ ఈ అవార్డులను అందజేస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ అవార్డు తమకే లభించిందంటూ వరుసగా రెండోసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడంపట్ల సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణీయులందరికి అభినందనలు తెలిపారు. కాగా, త్వరలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును సింగరేణి సంస్థకు ప్రదానం చేయనున్నారు.