బిజినెస్

శ్రీసిటీలో మరో నూతన పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం/తడ, జూలై 15: చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీలో ఊర్మిళ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు సంబంధించి శనివారం భూమిపూజ చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయసేత్, డైరెక్టర్ నందినీసేత్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైకు చెందిన ఈ సంస్థ భారీ పరిశ్రమల నిర్మాణాలకు నిర్మాణ పరికరాలు, ఉపకరణాలు అద్దెకు ఇవ్వడంతోపాటు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయసేత్ మాట్లాడుతూ తమ సంస్థను శ్రీసిటీలో ఏర్పాటుచేయడం అనందంగా ఉందని, తమ నిర్మాణ పరికరాలు, అద్దె సర్వీసులకు దేశంలో మంచి డిమాండ్ ఉందని, మార్కెట్ అవసరాల దృష్ట్యా అధునాతన పరికరాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

చిత్రం.. శ్రీసిటీలో ఊర్మిళ ఎంటర్‌ప్రైజస్‌కు భూమిపూజ చేస్తున్న కంపెనీ ప్రతినిధులు