బిజినెస్

ఇన్ఫోసిస్ చైర్మన్‌గానే కొనసాగాల్సింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి.. సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడంపై పశ్చాత్తాపం చెందారు. 2014లో ఆయన ఇన్ఫోసిస్ చైర్మన్‌గా పదవీ విరమణ పొందారు. అయితే నాడు సహచర వ్యవస్థాపకులు తనను చైర్మన్‌గానే ఉండాలని కోరారని, అయినప్పటికీ వినకుండా రాజీనామా చేశానంటూ సోమవారం బాధపడ్డారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో నెలకొన్న పరిస్థితులపై మూర్తి ఇటీవలికాలంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ముఖ్యంగా ఇప్పటి యాజమాన్యం తీరును ఆయనతోపాటు సంస్థ వ్యవస్థాపకులంతా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో మూర్తి ఓ ప్రముఖ జాతీయ వార్తా చానల్‌తో పైవిధంగా స్పందించారు.