బిజినెస్

ఆక్వాకు ముసురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 17: ఆక్వా రంగానికి ముసురు పట్టింది. ఒడిశా, పశ్చిమ సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆక్వా రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురువడమేకాకుండ తీరం వెంబడి 50 కిలో మీటర్లు మేర గాలులు వీస్తున్నాయి.
దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడంతో 2 హెచ్‌పి ఇంజన్లకు 4,12 ప్యాడ్లతో వీల్స్ కలిగిన ఏరియేటర్లు అమర్చి రాత్రి పగలు కూడా తిప్పుతున్నారు. మరోపక్క డిఒ లెవిల్స్ కూడా పడిపోతున్నాయి. ఇదే విధంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిస్తే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఏడాది మే మాసంలో సీడ్ వేసినవారితోపాటు కొద్ది రోజుల క్రితమే కొత్త నీటితో చెరువుల్లోకి సీడ్‌ను వదిలారు.
కొన్ని చెరువుల్లో ఇప్పటికే రొయ్యలు 50, 60 కౌంటుకు చేరుకోగా, మరికొన్ని చెరువుల్లో సీడ్ దశ దాటి, ఎదిగే స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో కురుస్తున్న ఈ వర్షాలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఏ నిమిషంలో ఏ చెరువుకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న సమయంలో ముఖ్యంగా తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 5 గంటల లోపు చెరువుల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలోనే చెరువులను కాపాడుకోవాలి. లేకపోతే నష్టం కోట్ల రూపాయలలోనే ఉంటుంది. దీంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా చెరువుల గట్ల మీద జాగారం చేస్తున్నారు. కాగా, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చేపల రైతులకు కూడా నష్టాలు తథ్యమనిపిస్తోంది.
వర్షాల సీజనులో తాబేళ్లు, కప్పలు, పాములు, పీతలు, నీటి పక్షులు తదితర జీవాలు ఒక చోట నుంచి మరో చోటకు చేరుతుంటాయి. వీటివల్ల చెరువుల్లో వైరస్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముంది.
ఇది మరో తరహా ప్రమాదంగా రైతులు భావిస్తున్నారు. దీంతో సదరు ప్రాణులను సాధ్యమైనంత వరకు చెరువుల్లో చేరకుండా చూడటానికి చర్యలు తీసుకుంటున్నారు.

చిత్రం.. నీటిలోని ఆక్సిజన్ పరిమాణం తగ్గకుండా నిరంతరాయంగా రొయ్యల చెరువులో తిరుగుతున్న ఏరియేటర్లు