బిజినెస్

హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య స్పైస్‌జెట్ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం (ఉడాన్)లో భాగంగా విమానయాన సేవలు లేని దేశంలోని వివిధ నగరాలకు, పట్టణాలకు విమాన సంస్థలు విమానాలను ప్రారంభిస్తున్నది తెలిసిందే. ఈ పథకంలో భాగంగానే హైదరాబాద్-పుదుచ్చేరి విమాన సర్వీసును స్పైస్‌జెట్ తీసుకురాగా, ఇలాంటి సర్వీసులను గతంలో రెండింటిని ఇది ప్రకటించింది. ఉడాన్ పథకంలో మొత్తం 128 మార్గాల్లో విమాన సర్వీసులను నడిపేందుకు 5 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా, స్పైస్‌జెట్‌కు 11 మార్గాలు మంజూరయ్యాయి. కాగా, 78 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన విమానాన్ని హైదరాబాద్-పుదుచ్చెరి మధ్య స్పైస్‌జెట్ నడపనుండగా, ఇది వచ్చే నెల 16 నుంచి మొదలవుతుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, తిరుపతి, అహ్మదాబాద్, జైపూర్, చంఢీగఢ్, విజయవాడ, వారణాసి ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ సర్వీసు నడుస్తుంది. ఇక ఉడాన్ పథకంలో ప్రభుత్వం నుంచి రాయితీ తీసుకోని ఏకైక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కావడం విశేషం. విమానంలోని మొత్తం సీట్లలో సగం సీట్లను తక్కువ ధరకే కేటాయించడానికి ఆయా విమానయాన సంస్థలకు ఉడాన్ పథకంలో ప్రభుత్వం రాయితీని అందిస్తున్నది తెలిసిందే. ఇదిలావుంటే ఈ నెల ఆరంభంలో ముంబయి-పోర్‌బందర్-ముంబయి, ముంబయి- కండ్లా-ముంబయి మార్గాల్లో విమాన సర్వీసులను స్పైస్‌జెట్ ప్రారంభించింది. అడంపూర్, కండ్లా, పుదుచ్చేరి, జైసల్మేర్, పోర్‌బందర్, కాన్పూర్‌లకూ ఉడాన్ పథకంలో భాగంగా విమాన సేవలను స్పైస్‌జెట్ అందుబాటులోకి తీసుకురానుంది.