బిజినెస్

‘21 బ్యాంకుల్లో తొమ్మిదింటికి నష్టాలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలోని మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 9 బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం (2016-17) నష్టాలను అందుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వీటిలో ఐడిబిఐ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులు కూడా ఉన్నాయి. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) నష్టాలపాలైన ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 13గా ఉందన్నారు. మరోవైపు ఒక ఆర్థిక సంవత్సరంలో 36 లక్షలకుపైగా బ్యాంక్ ఖాతాల్లో 10 లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తాలు డిపాజిట్ జరిగాయని గంగ్వార్ చెప్పారు. ఇదిలావుంటే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ఒక్క పాత పెద్ద నోట్ల రద్దు మాత్రమే దెబ్బతీయదని మంత్రి పునరుద్ఘాటించారు. పాత పెద్ద నోట్ల రద్దుతోనే దేశ జిడిపి మందగమనంలోకి వెళ్లిందన్న అభిప్రాయాలు తప్పన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పినది తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తీసుకురాగా, రద్దయిన నోట్లను బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను పొందాలని ప్రజలకు మోదీ సూచించారు. అయితే కేవలం 2,000 రూపాయల నోట్లు మాత్రమే చలామణిలోకి రావడంతో ఏర్పడిన చిల్లర కష్టాలు, డిమాండ్‌కు తగ్గ కొత్త నోట్లు బ్యాంకులకు అందకపోవడంతో ఏర్పడిన నగదు కొరత కారణంగా మార్కెట్ స్తంభించిపోయింది. దీంతో డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. ఇకపోతే 2014-15 నుంచి 2016-17 వరకు దొంగతనాలు, లూటీలు, మోసాల వల్ల దేశంలోని బ్యాంకులు 180 కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయని మంత్రి చెప్పారు.