బిజినెస్

పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపి, తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో నిలిచాయి. మొదటి స్థానంలో గుజరాత్ యథాతథంగా ఉండగా, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో తెలంగాణ నిలిచాయి. రెండో స్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో హర్యానా ఉన్నాయి. ఆర్థిక అధ్యయన సంస్థ ఎన్‌సిఎఇఆర్ విడుదల చేసిన ఈ జాబితాలో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి చోటు దక్కాయి. కార్మిక శక్తి, వౌలికాభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు, పరిపాలన, రాజకీయ సుస్థిరత, భూ వనరుల ఆధారంగా ఈ జాబితాను ఎన్‌సిఎఇఆర్ రూపొందించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సులభతరమైన వ్యాపార నిర్వహణ కోసం పలు చర్యలు తీసుకుంటున్నాయని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక బోర్డు (డిఐపిపి) కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. దేశంలో కనీసం 17 రాష్ట్రాలు వ్యాపార, పారిశ్రామిక అనుమతుల కోసం ఏక గవాక్ష విధానాన్ని (సింగిల్ విండో) అమలు చేస్తున్నాయన్నారు.