బిజినెస్

జుబిలెంట్ లైఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఔషధ రంగ సంస్థ జుబిలెంట్ లైఫ్ సైనె్సస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12.32 శాతం పడిపోయ 143.71 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 163.92 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,596.05 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,453.92 కోట్ల రూపాయలుగా ఉంది.
జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్
జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో గతంతో పోల్చితే 25.53 శాతం పెరిగి 23.84 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 18.99 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 681.81 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 612 కోట్ల రూపాయలుగా ఉంది.
గృహ ఫైనాన్స్
మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ అనుబంధ సంస్థ అయన గృహ ఫైనాన్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20 శాతం పెరిగి 72 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 60 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 398.12 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 346.34 కోట్ల రూపాయలుగా ఉంది.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సి ఎఫ్‌ఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 44 శాతం పెరిగి 65 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక ఆదాయం ఈసారి 490 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 485 కోట్ల రూపాయలుగా ఉంది.