బిజినెస్

హెచ్‌యుఎల్ లాభం రూ.1,283 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 9.28 శాతం పెరిగి 1,283 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 1,174 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హెచ్‌యుఎల్ తెలియజేసింది. నికర అమ్మకాలు ఈసారి 9,094 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 8,662 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. దీంతో 4.98 శాతం వృద్ధి నమోదైనట్లయింది. కాగా, మొత్తం ఆదాయం ఈసారి 9,335 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు 8,910 కోట్ల రూపాయలుగా ఉంది. గతంతో పోల్చితే 4.76 శాతం పెరిగింది. మరోవైపు మంగళవారం ట్రేడింగ్‌లో హెచ్‌యుఎల్ షేర్ విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 0.47 శాతం పెరిగి 1,158.20 రూపాయల వద్ద స్థిరపడింది.
అల్ట్రాటెక్ సిమెంట్
ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 15.14 శాతం పెరిగి 897.91 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్ లో ఇది 779.83 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 8,094.50 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 7,603.35 కోట్ల రూపాయలుగా ఉంది.