బిజినెస్

ముగిసిన ట్రావెల్ ట్రేడ్ ఫెయిర్ తెలుగు రాష్ట్రాలకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ట్రావెల్ టూరిజం ఫెయిర్, బిజినెస్ లగ్జరీ ట్రావెల్ మార్ట్ ఉమ్మడిగా నిర్వహించిన మూడు రోజుల ట్రావెల్ ట్రేడ్ సదస్సు మంగళవారం ముగిసింది. సదస్సులో 12 దేశాలతోపాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 249 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న పలు సంస్థలకు ఫెయిర్‌ఫెస్ట్ మీడియా చైర్మన్ సంజీవ్ అగర్వాల్ అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డును ఇండియా టూరిజం, కైలాష్ ఎక్స్పిడిటీషన్స్ సంస్థకు, ఉత్తమ గోల్ఫ్ డెస్టినేషన్ ఇన్ ఇండియా అవార్డును జమ్ము కాశ్మీర్ టూరిజం సంస్థకు, ఇన్నోవేటివ్ ఉత్పత్తి అవార్డును ఫాక్స్‌ట్రాట్ ఇంటర్ యాక్టివ్ సంస్థకు, న్యూ డెస్టినేషన్ అవార్డును కొరియన్ టూరిజం సంస్థకు, ప్రత్యేక లేజర్ ఉత్పత్తి అవార్డును వెరైటీ క్రూజెస్, ఉత్తమ హోటల్ అవార్డును యాకర్ హోటల్స్, ఉత్తమ డెకరేషన్ అవార్డును రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, కేరళ, నేపాల్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ టూరిజం సంస్థలకు, గుజరాత్ కార్పొరేషన్ సంస్థలకు ప్రదానం చేశారు.

చిత్రం.. ట్రావెల్ ఫెయర్‌లో అవార్డులను అందజేస్తున్న నిర్వాహకులు