బిజినెస్

ఇన్ఫోసిస్‌కు రితికా సూరి గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రితికా సూరి రాజీనామా చేశారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2014 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా ద్వారా ఈమె సంస్థలోకి వచ్చారు. ఇన్ఫోసిస్ భారీ ఒప్పందాల్లో రితికా కీలకపాత్ర నిర్వహించగా, ఇజ్రాయెల్ ఆటోమెషన్ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులోనూ ముఖ్యభూమిక పోషించారు. ఎస్‌ఎపి మాజీ ఉద్యోగి అయిన రితికా సూరి.. స్టార్టప్‌లలో ఇన్ఫోసిస్‌ను పెట్టుబడుల వైపునకు నడిపించారు. 500 మిలియన్ డాలర్ల మేర ఇన్ఫోసిస్ పెట్టుబడులు పెట్టింది.