బిజినెస్

స్టాక్ మార్కెట్లకు సిగరెట్ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాలతో రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్న సూచీలు.. మంగళవారం మాత్రం ఈ ఏడాదిలోనే గరిష్ఠ స్థాయి నష్టాలను చవిచూశాయి. జిఎస్‌టిలో సిగరెట్లపై సెస్సును పెంచడంతో ఐటిసిసహా పలు సిగరెట్ ఆధారిత సంస్థల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చినది తెలిసిందే.
జిఎస్‌టిలో సిగరెట్లపై గరిష్ఠ స్థాయి పన్ను 28 శాతాన్ని విధించారు. అయితే జిఎస్‌టి అమల్లోకి వచ్చాక సోమవారం తొలిసారిగా సమావేశమైన జిఎస్‌టి కౌన్సిల్.. సిగరెట్లపై సెస్సును పెంచింది. దీంతో ఒక్కో సిగరెట్‌పై ఈ భారం 48.50 పైసల నుంచి 79.20 పైసల మేర పడుతోంది. మరోవైపు ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల రూపాయల మేర ఆదాయం పెరుగుతుండగా, సిగరెట్ తయారీ సంస్థల ఆదాయానికి గండి పడుతోంది. దీనికి కారణం సెస్సు పెరిగినప్పటికీ.. సిగరెట్ ధరలు పెరిగే అవకాశాలు లేకపోవడమే.
ఈ క్రమంలో ఈ ఒక్కరోజే ఐటిసి షేర్ విలువ 12.63 శాతం పతనమైంది. 284.60 రూపాయల వద్ద స్థిరపడింది. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. అలాగే గాడ్‌ఫ్రే ఫిలిప్స్, విఎస్‌టి ఇండస్ట్రీస్ షేర్ల విలువ కూడా 7.83 శాతం వరకు పడిపోయింది. వీటితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్‌బిఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్ర బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర తదితర అగ్రశ్రేణి సంస్థల షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేక పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ కూడా 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయంది.
మంగళవారం ట్రేడింగ్‌లో 10,226.71 కోట్ల రూపాయలు నష్టపోయ 4,94,231.38 కోట్ల రూపాయల వద్ద స్థిరపడింది. సోమవారం 5,04,458.09 కోట్ల రూపాయల వద్ద ఉన్నది తెలిసిందే. మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 1,519.90 వద్ద ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షేల్, ఒఎన్‌జిసి నుంచి కేంద్ర ప్రభుత్వం 3 బిలియన్ డాలర్లను కోరుతుండటం కూడా రిలయన్స్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బిఎస్‌ఇలోని సంస్థల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే 85,000 కోట్ల రూపాయలు దిగజారింది. 130.52 లక్షల కోట్ల రూపాయల నుంచి 129.67 లక్షల కోట్ల రూపాయలకు తగ్గింది. బిఎస్‌ఇ మార్కెట్ విలువలో టిసిఎస్‌ను రిలయన్స్ వెనక్కి నెట్టినది తెలిసిందే. ఈ నెలారంభంలో రిలయన్స్ ముందుకురాగా, ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా రిలయన్స్ షేర్ విలువ 43 శాతం పెరిగింది.
ఇకపోతే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 363.79 పాయింట్లు క్షీణించి 31,710.99 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 88.85 పాయింట్లు కోల్పోయి 9,827.10 వద్ద నిలిచింది. సోమవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 32,074.78 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకగా, నిఫ్టీ మునుపెన్నడూ లేనివిధంగా 9,900 మార్కును అధిగమించి 9,915.95 వద్ద ముగిసినది తెలిసిందే. ఒకానొక దశలో సెనె్సక్స్ 32,131.92 పాయింట్ల వద్దకు, నిఫ్టీ 9,920.30 పాయింట్ల వద్దకు చేరాయి.
మరోవైపు ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ 0.59 శాతం పడిపోతే, షాంగై సూచీ 0.35 శాతం, హాంకాంగ్ సూచీ 0.21 శాతం మేర పెరిగాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్ సూచీ 0.24 శాతం, జర్మనీ సూచీ 0.55 శాతం మేర నష్టపోగా, బ్రిటన్ సూచీ మాత్రం 0.06 శాతం పెరిగింది.