బిజినెస్

పొగాకు ధర పైపైకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జూలై 20: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు రేట్లు రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. కిలోకు నాలుగైదు రూపాయల వంతున పెరుగుదల కనిపిస్తుండటంతో ఒకటి రెండ్రోజుల్లోనే గరిష్ఠ ధర రూ.200కు చేరుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. అదే జరిగితే ఐదేళ్ల క్రితం నాటి రికార్డును బ్రేక్‌చేసినట్టే. జిల్లాలోని దేవరపల్లి పొగాకు కేంద్రంలో గురువారం జరిగిన వేలంలో కిలో గరిష్ఠ ధర రూ.197 పలికింది. గత రెండు రోజుల్లో ఒకేసారి ధర కిలోకు రూ.4 పెరిగింది. ఇదే జోరు కొనసాగితే రూ.200 ధర కళ్లజూస్తామని రైతులు పేర్కొంటున్నారు. 2012వ సంవత్సరంలో కిలో రూ.199.80 గరిష్ఠ ధర పలికింది. అప్పట్లో అది దేశంలోనే రికార్డుగా భావించారు. ఈ సీజనులో ఆ రికార్డు బద్దుల కావడం తథ్యమనే వాదన వినిపిస్తోంది. దక్షిణాంధ్రలో పొగాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గడంవల్ల పొగాకు కంపెనీల కన్ను ఎన్‌ఎల్‌ఎస్ పొగాకుపై పడింది. దక్షిణాంధ్రాలోని ఎస్‌ఎల్‌ఎస్, ఎస్‌బిఎస్, తొర్రేడులోని పొగాకు వేలం కేంద్రంలో వేలం పూర్తికావడంతో ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోగల ఐదు పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు రేట్లు పెరుగుతున్నాయి. కాగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం కిలో సరాసరి రూ.180 ఉందని వేలం నిర్వహణాధికారి హనుమంతరావు తెలిపారు. అతితక్కువ ధర రూ.105, మీడియం 158 రూపాయలు, బ్రైట్ రూ.192 పలికిందన్నారు. గురువారం సరాసరి అత్యల్ప ధర కిలో రూ.124 పలికింది. సరాసరి ధర కిలో రూ.180 ఉండటంతో పొగాకు నిల్వ ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో 62శాతం పొగాకు అమ్మకాలు జరిగాయి.

చిత్రం.. దేవరపల్లిలో పొగాకు వేలం నిర్వహిస్తున్న దృశ్యం