బిజినెస్

శ్రీసిటీలో మరో ఆటోమొబైల్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, జూలై 21: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్స్ విడిభాగాల తయారీ పరిశ్రమ తొహుకు స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌కు శుక్రవారం శ్రీసిటీలో భూమిపూజ చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యమడా, డైరెక్టర్ నొనకల సమక్షంలో ప్రెసిడెంట్ ఎమగుచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసిటీలో పలు ఇతర జపాన్ కంపెనీల సిఇఒలు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సుమారు రూ. 80 కోట్ల పెట్టుబడితో ఆటోమొబైల్ ఇంజిన్ వాల్స్‌ను తయారుచేసే ఈ పరిశ్రమకోసం శ్రీసిటీ డొమెస్టిక్ టారీఫ్ జోన్‌లో 6 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ యమగుచి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఇచ్చిన మేకిన్ ఇండియా పిలుపునకు స్పందించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చామన్నారు. శ్రీసిటీలో ఉన్న ఎన్నో అనుకూలతల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామన్నారు. 2018 చివరినాటికి కంపెనీ ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం.. నూతన పరిశ్రమకు భూమిపూజ చేస్తున్న జపాన్ సంస్థ ప్రెసిడెంట్ యమగుచి